బీఆర్‌ఎస్ పాల‌నలోని ప్రభుత్వ అధికారులపై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By Mahesh Rajamoni  |  First Published Dec 9, 2023, 9:58 PM IST

Kilari Anand Paul: భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నేతృత్వంలో కొన‌సాగిన బీఆర్ఎస్ పాల‌న‌, ఆ పార్టీ నాయ‌కులు, ప్ర‌భుత్వం అధికారులుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన‌ కేఏ పాల్.. ప్ర‌జా ధ‌నాన్ని దోచుకున్నార‌ని ఆరోపించారు.
 


Praja Shanti Party president K A Paul: ప్ర‌జాశాంతి పార్టీ నాయ‌కుడు కిలారి ఆనంద్ పాల్ (కేఏ పాల్) మ‌రోసారి ప్ర‌భుత్వ అధికారులు, తెలంగాణ‌లోని గ‌త ప్ర‌భుత్వ నాయ‌కుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ పాల‌న‌లో ప‌నిచేసిన ప్ర‌భుత్వ అధికారులు పాస్ ప‌ర్టుల‌ను స్వాధీనం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.

భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నేతృత్వంలో కొన‌సాగిన బీఆర్ఎస్ పాల‌న‌, ఆ పార్టీ నాయ‌కులు, ప్ర‌భుత్వం అధికారులుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన‌ కేఏ పాల్.. ప్ర‌జా ధ‌నాన్ని దోచుకున్నార‌ని ఆరోపించారు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో పనిచేసిన ప్రభుత్వ అధికారులందరి పాస్‌పోర్టులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కేఏ పాల్ రాష్ట్ర పోలీసులను డిమాండ్ చేశారు.

Latest Videos

‘‘మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుటుంబసభ్యులు, సన్నిహితులు, ఆయనతో కలిసి పనిచేసిన అధికారులను దేశం విడిచి వెళ్లనివ్వకుండా ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి చూడాలి. వీరంతా భారీ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు’’ అని వీడియో ప్రకటనలో ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని పాల్ విమ‌ర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరూ రాష్ట్రాన్ని రుణ విముక్తం చేసి ప్రజలు అభివృద్ధి చెందేలా చూడాలని ఆయన కోరారు.

click me!