మన ఎమ్మెల్యే బూతుపురాణం ఇది...!

Published : Mar 02, 2017, 09:19 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
మన ఎమ్మెల్యే బూతుపురాణం ఇది...!

సారాంశం

లైన్ మెన్ కు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషించాడు.

ఎమ్మెల్యే ఇంట్లో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా... నియోజకవర్గమంతా చీకటైపోదూ...

 

అందుకే ప్రజాసమస్యలు పరిష్కరించే సమయంలో కరెంట్ పోవడంతో ఆ ఎమ్మెల్యేకు కోపం వచ్చింది.

 

తన ఇంట్లో కరెంట్‌ కట్ చేసిన లైన్ మెన్ కు  ఇలా బూతు పురాణం వినిపించాడు.

http://vocaroo.com/delete/s1yfuYdRejVN/649ec4f1f4550780

 

బిల్లు కట్టకపోవడం వల్ల తన విధినిర్వహణలో భాగంగా కరెంట్ సరఫరా నిలిపేశానని చెప్పినా వినకుండా అసభ్యపదజాలతో దూషించాడు.

 

ఇంతకీ ఆయనెవరో కాదు పరగి ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత రామ్మోహన్‌ రెడ్డి

 

ఎమ్మెల్యే తన ఇంటి కరెంట్ బిల్లుకు సంబంధించి సుమారు రూ.50 వేలు బకాయిలు ఉండటంతో కరెంట్‌ కట్‌ చేయాలని పై అధికారులు ఆదేశించడంతో లైన్‌ మెన్‌ సరఫరా ఆపివేశాడు.

 

దీంతో రామ్మోహన్ రెడ్డికి కోపం నశాలానికంటింది. లైన్ మెన్ కు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషించాడు.

 

కాగా, ఈ ఘటన పోలీస్‌ స్టేషన్‌ లో బాధితుడు  ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

 


 

 

 

 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!
Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు