బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. న్యాయం చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు మాట తప్పారని.. తనకిక న్యాయం జరగదని శేజల్ ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. గురువారం హైదరాబాద్ పెద్దమ్మ టెంపుల్ వద్ద నిద్రమాత్రలు మింగిన ఆమె స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, శేజల్ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుర్గం చిన్నయ్య తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె లేఖలో ఆరోపించారు. న్యాయం చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు మాట తప్పారని.. తనకిక న్యాయం జరగదని శేజల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Also Read: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్.. ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్ తో బీఆర్ఎస్ ఎంపీల చర్చలు..
కాగా.. చిన్నయ్య తనను మానసికంగా , లైంగికంగా వేధిస్తున్నారని బోడపాటి శేజల్ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమీషన్, జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యేను తక్షణం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయాలని శేజల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం తెలంగాణ భవన్ వద్ద విషయం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన అక్కడి వారు శేజల్‌ను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.