ప్రియుడి చేతిలో మోసపోయి... హైదరాబాద్ లో రోడ్డున పడ్డ ఒంగోలు యువతి

By Arun Kumar P  |  First Published Apr 11, 2023, 12:10 PM IST

ప్రియుడి చేతిలో మోసపోయి హైదరాబాద్ రోడ్లపై రోదిస్తున్న యువతికి పోలీసులు ధైర్యం చెప్పారు. 


హైదరాబాద్ : మాయమాటలు నమ్మిన యువతి అతడి ప్రేమలో మునిగిపోయింది. ప్రాణంగా ప్రేమించిన వాడికోసం కన్న తల్లిదండ్రులను, సొంతూరును వదిలి హైదరాబాద్ కు చేరుకుంది. అయినవారినంతా వదిలిపెట్టి తన కోసం వచ్చిన యువతిని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి నడిరోడ్డుపై ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లిపోయాడు కసాయి ప్రియుడు. ఇలా ప్రేమపేరిట మోసపోయిన యువతి దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడింది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒంగోలు కు చెందిన యువతి, నిజామాబాద్ యువకుడు ప్రేమించుకున్నారు.రోజూ ఫోన్ చేసుకుని మాట్లాడుకునే వీరిద్దరు తాజాగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ కు రావాల్సిందిగా ప్రియుడు కోరడంతో వెనకా ముందు ఆలోచించకుండానే ఆమె నగరానికి వచ్చింది. కానీ ప్రియుడి చేతిలో మోసపోయిన యువతి రోడ్డున పడింది. 

Latest Videos

Read More  ప్రేమించి, గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకోమంటే.. అడవిలోకి తీసుకెళ్లి అతడు చేసిన పని..

హైదరాబాద్ కు వచ్చిన యువతిని లింగంపల్లికి తీసుకెళ్ళిన యువకుడు రోడ్డుపై వదిలిపెట్టి మాయమయ్యాడు. అతడి కోసం ఎదురుచూసిన యువతి ఎంతకూ రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. ఎటు వెళ్లాలో పాలుపోక రోడ్డుపక్కన కూర్చుని రోదిస్తున్న యువతిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువతికి ధైర్యం చెప్పి వివరాలను సేకరించారు. 

పటాన్ చెరులో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేసే యువకుడిని ప్రేమించినట్లు... అతడు రమ్మన్నాడనే హైదరాబాద్ కు వచ్చినట్లు యువతి తెలిపింది. ప్రస్తుతం అతడి ఫోన్ స్విచ్చాప్ వస్తోందని యువతి తెలిపింది. దీంతో పోలీసులు యువతిని స్టేట్ హోం కు తరలించారు. ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని... వారితో యువతిని పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!