టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై సిట్ అధికారులు మంగళవారంనాడు హైకోర్టుకు నివేదికను సమర్పించారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ లో ప్రవీణ్, రాజశేఖర్ లు కీలకంగా వ్యవహరించారని సిట్ బృందం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. తెలంగాణ హైకోర్టుకు సిట్ అధికారులు మంగళవారంనాడు నివేదికను అందించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సిట్ అధికారులు హైకోర్టుకు నివేదికను అందించింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై సిట్ విచారణపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఈ ఏడాది మార్చి 21న ఆదేశించింది. దీంతో ఇవాళ హైకోర్టుకు సిట్ బృందం స్టేటస్ రిపోర్టును అందించింది.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై సిట్ విచారణపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఈ ఏడాది మార్చి 21న ఆదేశించింది. దీంతో ఇవాళ హైకోర్టుకు సిట్ బృందం స్టేటస్ రిపోర్టును అందించింది.
also read: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌లో రంగంలోకి ఈడీ: శంకరలక్ష్మికి నోటీసులు
ప్రవీణ్ , రాజశేఖర్ లు క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి అమ్ముకున్నారని సిట్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఆ నివేదిక పేర్కొంది. మరో వైపు ఈ కేసులో 450 మంది సాక్షులను విచారించినట్టుగా సిట్ పేర్కొంది. పేపర్ లీక్ కారణంగా ఆరు పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేసిందని హైకోర్టుకు సిట్ నివేదికను ఇచ్చింది. టీఎస్‌పీఎస్‌సీలో పనిచేస్తూ కొందరు ఉద్యోగులు గ్రూప్స్ పరీక్షలు రాశారని ఆ నివేదిక పేర్కొంది. అంతేకాదు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి , రేణుక ఫోన్లకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు.