Telangana Omicron Update: సిరిసిల్ల జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఒమిక్రాన్

Arun Kumar P   | Asianet News
Published : Dec 27, 2021, 02:08 PM ISTUpdated : Dec 27, 2021, 02:46 PM IST
Telangana Omicron Update: సిరిసిల్ల జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఒమిక్రాన్

సారాంశం

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఒమిక్రాన్ సోకింది. 

సిరిసిల్ల: తెలంగాణలో ఒమిక్రాన్ (omicron) మహమ్మారి కోరలు చాస్తోంది. ఇప్పటివరకు విదేశాల నుండి వచ్చినవారిలోనే ఈ కరోనా వేరియంట్ (corona variant) ఎక్కువగా బయటపడగా తాజాగా వారిద్వారా ఇతరులకు కూడా వ్యాపించడం ప్రారంభమయ్యింది. ఫస్ట్ కాంటాక్ట్స్ మాత్రమే వారిద్వారా సెకండ్ కాంటాక్ట్స్ కు కూడా ఒమిక్రాన్ బారిన పడిన ఘటనలు రాష్ట్రంలో వెలుగుచూస్తున్నాయి. ఇలా సిరిసిల్ల జిల్లా (rajanna siricilla district)లో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నిర్దారణ అయ్యాయి. 

ఇటీవల దుబాయ్ (dubai) నుండి వచ్చిన పిట్ల రాంచంద్రం అనే వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. దీంతో అతడిని హైదరాబాద్ (hyderabad) లోని టిమ్స్ (TIMS) కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే అతడి కుటుంబసభ్యులతో పాటు స్నేహితులక కూడా వైద్యసిబ్బంది టెస్టులు చేసారు. ఈ క్రమంలోనే రాంచంద్రం తల్లి దేవమ్మ, భార్య మౌనిక, స్నేహితుడు హనుప అంజయ్య కు కరోనా పాజిటివ్ తేలింది. వారి నుండి శాంపిల్ సేకరించి జీనోమ్ సీక్వెల్ పరీక్ష చేయగా ముగ్గురికీ ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. దీంతో వెంటనే ఈ ముగ్గురిని వైద్యంకోసం హాస్పిటల్ కు తరించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు తెలిపారు. 

Read More  భారత్ లో Omicron కలకలం... 578కి చేరిన కేసులు... తెలుగురాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ...

రాంచంద్రం దుబాయ్ నుండి వచ్చి ఇంట్లో వుండటంతో తల్లీకి, భార్యకు ఒమిక్రాన్ సోకింది. అయితే ఇటీవల జరిగిన  ఓ పెళ్లికి అతడు హాజయ్యాడు. అక్కడ స్నేహితుడు అంజయ్య కలిసాడు. అతడికి కూడా ఒమిక్రాన్ సోకింది. దీంతో పెళ్లిలో రాంచంద్రం తో పాటు అంజయ్య కలిసిన వారిని గుర్తించి టెస్టులు చేసేందుకు వైద్యాధికారులు ప్రయత్నిస్తున్నారు. 

ఇలా సిరిసిల్ల జిల్లాలో వరుసగా ఒమిక్రాన్ కేసులు భయటపడుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వైద్యాధికారులు కూడా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తగా వుండాలని... అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని... కొంతకాలం వేడుకలకు దూరంగా వుండాలని సూచిస్తున్నారు.  

read more  తెలంగాణలో ఒమిక్రాన్ సెకండ్ కాంటాక్ట్ మొదటి కేసు.. ప్రమాదం అంటున్న వైద్యులు..

తెలుగురాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ 41కేసులతో దేశంలోనే అత్యధిక ఒమిక్రాన్ కేసులు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.  

దేశంలోని 19 రాష్ట్రాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా న్యూడిల్లీలో 142 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 141, కేరళ 57, గుజరాత్ 49, రాజస్థాన్ 43, తెలంగాణ 41, తమిళనాడు 34, కర్ణాటక 31 కేసులు నమోదయ్యాయి. ఇక మధ్య ప్రదేశ్ 9, ఆంధ్ర ప్రదేశ్ 6, పశ్చిమ బెంగాల్ 6, హర్యానా 4, ఒడిషా 4, చత్తీస్ ఘడ్ 3, జమ్మూ కాశ్మీర్ 3, ఉత్తర ప్రదేశ్ 2, హిమాచల్ ప్రదేశ్ 1, లడక్ 1, ఉత్తరాఖండ్ 1 ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు