తమ్ముడిని చంపిన అన్న.. కాగజ్ నగర్ లో ఘటన..

Published : Dec 27, 2021, 01:38 PM IST
తమ్ముడిని చంపిన అన్న.. కాగజ్ నగర్ లో ఘటన..

సారాంశం

కుటుంబ కలహాలతో ఓ అన్న సొంత తమ్ముడినే హత్య చేశాడు. ఈ ఘటన కాగజ్ నగర్ పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

కాగ‌జ్‌ న‌గ‌ర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒకే క‌డుపున పుట్టిన సొంత త‌మ్ముడినే ఓ అన్న అతికిరాత‌కంగా హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం సృష్టించింది. కుటుంబ క‌ల‌హాలే ఈ ఘ‌ట‌న‌కు దారి తీశాయ‌ని స్థానికులు చెబుతున్నారు. కాగ‌జ్ న‌గ‌ర్ ప‌ట్ట‌ణానికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య కొంత కాలంగా కుటుంబ క‌ల‌హాలు నెల‌కొన్నాయి. అయితే ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న త‌మ్ముడిపై అన్న రాజు బండ‌తో దాడి చేశాడు. దీంతో అత‌డు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అనంత‌రం పోలీసుల‌కు లొంగిపోయాడు. ఈ విష‌యం తెలియ‌డంతో స్థానికులు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. పోలీసుల ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?