నిమ్స్ నర్సుల మెరుపు సమ్మె.. డైరెక్టర్ పై ఆరోపణలు.. స్తంభించిన వైద్య సేవలు...

By SumaBala BukkaFirst Published Mar 21, 2023, 12:20 PM IST
Highlights

హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో నర్సులు సమ్మె చేపట్టారు. డైరెక్టర్ ను మార్చాలంటూ వారు ఆందోళనకు దిగారు. వీరి మెరుపు సమ్మెతో వైద్య సేవలు నిలిచిపోయాయి. 

హైదరాబాద్ :  హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో నర్సులు మెరుపు సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు.  ఇన్చార్జ్ డైరెక్టర్ మీద ఆరోపణలు చేస్తూ వీరు ఈ సమ్మెకు పూనుకున్నారు. ఇన్చార్జి డైరెక్టర్ అదనకు డ్యూటీలు వేస్తున్నారని..  చేయాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం రాత్రి నుంచి నిమ్స్ లో ఈ కారణంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. నర్సులు మెరుపు సమ్మె చేపట్టడంతో ఆపరేషన్లకు అంతరాయం ఏర్పడింది.

ప్రస్తుత నిమ్స్ డైరక్టర్ మాకు వద్దు అంటూ నిమ్స్ నర్సులు ఆందోళన చేపట్టారు.  నర్సులపై జరుగుతున్న అరాచకాలని వ్యతిరేకిస్తూ నర్సులు విధులు బహిష్కరణ చేశారు. లెక్క ప్రకారం 2300 ఉండాల్సిన నర్సులు 800 మంది మాత్రమే ఉన్నామని...ఇందులో రెగ్యులర్ గా పనిచేసే 500 మంది నర్సింగ్ స్టాఫ్ పైన ఒత్తిడి పెరుగుతోందని అన్నారు.  ‘నిమ్స్ లో ఉన్న నర్సింగ్ స్టాఫ్ సమస్యలు రిప్రజెంట్ చేయడానికి వెళ్తే డైరెక్టర్ కలవరు...సమస్యలు చెప్పిన వారి పై టార్గెట్ చేస్తూ మెమోలు ఇస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

యువతి ప్రాణం తీసి మూర్ఛ.. బ్రష్ చేస్తుండగా సంపులో పడి మృతి..

అలా.. నర్సింగ్ సూపర్డెంట్ లలిత కుమారి, . నర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ విజయ కుమారి, స్లీవలకు మెమోలు ఇచ్చారని తెలిపారు.  ఎమర్జెన్సీ ఖాళీగా ఉంచి...బెడ్స్ ఖాళీగా ఉన్నాయని చూపడానికి జనరల్ వర్డ్ కు పేషెంట్ లని షిఫ్ట్ చేస్తున్నారు. దీంతో అక్కడ పేషెంట్ లకు కావాల్సిన సదుపాయాలు పట్టించుకోవడం లేదు. దీనివల్ల పేషెంట్ లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నర్సుల కు వర్క్ బర్డెన్ పెరుగుతుంది. వెంటనే ఇచ్చిన మెమోలు వెనక్కి తీసుకొని...గ్రేడ్ 1 నర్సింగ్ సూపరిండెంట్ కి ప్రమోషన్ ఇవ్వాలి.

డైరెక్టర్ కి క్లోజ్ గా ఉన్న వారికి ఎలాంటి రూల్స్ వర్తించకుండా ప్రమోషన్ లు ఇస్తున్నారు. ఇది ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తున్నారు. డైరెక్టర్ ని మార్చాలని ప్రభుత్వానికి వినతి... చేస్తున్నాం అంటూ వారు చెప్పుకొచ్చారు. 

click me!