రాజకీయ కోణంలోనే విచారణ, నా ఫోన్లు ఇస్తున్నా: ఈడీకి కవిత లేఖ

By narsimha lode  |  First Published Mar 21, 2023, 11:43 AM IST

ఈడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట కవిత  మంగళవారంనాడు లేఖ  రాశారు


న్యూఢిల్లీ: ఈడీకి  మంగళవారంనాడు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   లేఖ  రాశారు.  తనను  రాజకీయ కోణంలోనే  విచారణ  చేస్తున్నారని  ఈడీకి  రాసిన  లేఖలో  కవిత పేర్కొన్నారు. తనపై ఈడీ తప్పుడు  ప్రచారం చేస్తుందని  ఆ లేఖలో  కవిత  ఆరోపించారు.   గతంలో  తాను  ఉపయోగించిన  అన్ని  ఫోన్లను  ఈడీకి అందిస్తున్నానని  కవిత  ఆ లేఖలో  పేర్కొన్నారు.

తాను  ఫోన్లను  ధ్వంసం చేశానని  తప్పుడు ప్రచారం చేశారని  కవిత ఆ లేఖలో  పేర్కొన్నారు.  ఏ ఉద్దేశ్యంతో  ఇలా  చేశారని కవిత  ప్రశ్నించారు.  మహిళ  ఫోన్లను  స్వాధీనం  చేసుకోవడం  స్వేచ్ఛకు  భంగం కల్గించడమేనని  ఆమె  ఆ లేఖలో  పేర్కొన్నారు.  ఫోన్ల విషయంలో  కనీసం  సమన్లు  కూడా  ఇవ్వలేదని  కవిత  గుర్తు  చేశారు.

Latest Videos

 2022  నంబర్ మాసంలోనే  తాను  ఫోన్లను  ధ్వంసం  చేసినట్టుగా  తప్పుడు  ప్రచారం చేశారని  కవిత ఆ లేఖలో  పేర్కొన్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం  విచారణకు  సహకరిస్తున్నట్టుగా  కవిత  ఆ లేఖలో   ప్రస్తావించారు.  

తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీక్  చేయడం వల్ల  తన  రాజకీయ ప్రత్యర్థులు తనను  ప్రజల్లో నిందిస్తున్నారని  కవిత  చెప్పారు. ఈ ప్రచారం తన  ప్రతిష్టకు తీవ్ర భంగం కలుగుతుందన్నారు. అంతే కాకుండా తన పరువును తన  పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని  కవిత  ఆ లేఖలో  అభిప్రాయపడ్డారు. ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరంగా కవిత  పేర్కొన్నారు. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: వరుసగా రెండో రోజూ ఈడీ విచారణకు కవిత, ఫోన్లను మీడియాకు చూపిన ఎమ్మెల్సీ

ఈడీ  విచారణకు  హాజరయ్యే ముందు  కవిత   మీడియాకు  మొబైల్ ఫోన్లను  చూపించారు.  కేసీఆర్ అధికారిక  నివాసం బయట , ఈడీ కార్యాలయం బటయ  కవిత  మీడియాకు  ఈ మొబైల్ ఫోన్లను  చూపారు.

click me!