నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినీ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినీ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె మహాకూటమిలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. శనివారం ఈ మేరకు ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను కచ్చితంగా గెలిచి తీరతానని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి అని తెలిపారు. ఈ విషయం చాలా సార్లు తన తండ్రికి తెలిపినట్లు ఆమె వివరించారు.
ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని ఆమె అన్నారు. నియోజకవర్గమంతా పాదయాత్ర చేస్తానన్నారు. కూకట్‌పల్లిలోని అన్ని ప్రాంతాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతానని వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తానన్నారు. మందడి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డితోపాటు ఇతర నాయకులతో కలిసి అన్ని కాలనీలు, బస్తీల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థిస్తానన్నారు. సినిమాల షెడ్యూల్ చూసుకుని బాబాయ్ బాలకృష్ణతోపాటు సోదరులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ప్రచారంలో పాల్గొంటారని ఆమె వివరించారు.
read more news
కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే
కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని
సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని
బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి
మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి
అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని
హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని
నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు
కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి