టీడీపి అభ్యర్థి సామ రంగారెడ్డికి మరోసారి షాక్

By pratap reddyFirst Published Nov 19, 2018, 7:05 AM IST
Highlights

ఈ స్థితిలో ఇబ్రహీంపట్నం బీఫాం‌మ్‌ కోసం సామా రంగారెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 వరకు రంగారెడ్డి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఉన్నారు. 

హైదరాబాద్: ఆశించిన ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వకుండా సామ రంగారెడ్డికి తొలి షాక్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆదివారంనాడు మరో షాక్ ఇచ్చింది. ఇబ్రహీంపట్నం టికెట్ సామ రంగారెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సీటును పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది.

ఇబ్రహీంపట్నం టికెట్ తనకు కావాలని కోరడానికి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీపీ నేత రొక్కం భీంరెడ్డి కలిశారు.  37ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నానని ఆయన చంద్రబాబుకు వివరించారు. 

ఈ స్థితిలో ఇబ్రహీంపట్నం బీఫాం‌మ్‌ కోసం సామా రంగారెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 వరకు రంగారెడ్డి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఉన్నారు. అయితే తనకు బీ ఫామ్‌ ఇవ్వకపోవడంతో ఆయన వెనుదిగారు. 

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో 12 మంది అభ్యర్థులకు టీటీడీపీ బీఫామ్స్‌ అందజేసిన విషయం తెలిసిందే. భీపామ్ అందుకున్న నేతలతో ఆ పార్టీ ప్రతిజ్ఞ చేయించింది. ప్రతిజ్ఞ చేసిన వారిలో సామా రంగారెడ్డి కూడా ఉన్నారు. అయితే,  ఆయనకు బీ ఫామ్ మాత్రం దక్కలేదు. 

click me!
Last Updated Nov 19, 2018, 7:05 AM IST
click me!