హైదరాబాద్‌కు అజిత్ దోవల్.. ఐపీఎస్ ప్రొబేషనర్లకు అభినందనలు.. టీమ్‌గా కలిసి పనిచేయాలని సూచన

Published : Nov 12, 2021, 06:01 PM IST
హైదరాబాద్‌కు అజిత్ దోవల్.. ఐపీఎస్ ప్రొబేషనర్లకు అభినందనలు.. టీమ్‌గా కలిసి పనిచేయాలని సూచన

సారాంశం

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హైదరాబాద్ వచ్చారు. ఐపీఎస్ ప్రొబెషనర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో మాట్లాడుతూ వారికి అభినందనలు తెలిపారు. అందరూ టీమ్‌గా పనిచేయాలని, దేశానికి అంకితమైన ఒక కుటుంబంగా సేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా అమరులైన ఐపీఎస్ అధికారులకు నివాళులు అర్పించారు.  

హైదరాబాద్: జాతీయ భద్రత సలహాదారు Ajit Doval హైదరాబాద్ వచ్చారు. నగరంలోని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 73వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల Passing Out Paradeకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ పరేడ్‌కు సీనియర్ అధికారులు, ప్రొబేషనర్ల కుటుంబ సభ్యులూ హాజరయ్యారు. దీక్షంత్ పరేడ్‌ నుంచి సెల్యూట్ స్వీకరించిన ఆయన.. ప్రొబేషనర్లు అందరికీ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా మహిళా ట్రైనీ అధికారులకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు.

Hyderabadలోని అకాడమీలో ఇచ్చిన శిక్షణలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఐపీఎస్ ట్రైనీ అధికారులకు ట్రోఫీలు అందించారు. ఉన్నత ప్రదర్శన కనబరిచిన దర్పన్ అహ్లువాలియాను ప్రశంసించారు. అకాడమీలో శిక్షణ పొందిన విదేశీ అధికారులకూ కంగ్రాట్స్ తెలిపారు. దేశం కోసం ఎంతమాత్రం ఆలోచించకుండా ప్రాణాలను త్యాగం చేసిన ఐపీఎస్ అమరులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దేశాన్ని నిర్మాణానికి వారు తమ ప్రాణాలు త్యాగం చేశారని వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అధికారులూ ఒక టీమ్‌గా కలిసి పనిచేయాలని, దేశా సేవలకు అంకితమైన కుటుంబంగా పని చేయాలని సూచించారు. చట్టబద్ధ పాలనకు పోలీసులు పాత్ర కీలకమైనదని, దేశవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండటానికి బద్దులై ఉండాలని అన్నారు. అంతేకాదు, అందరూ అధునాతన సాంకేతికతల సామర్థ్యాలను పెంచుకోవాలని అన్నారు. విధానపరమైన నిర్ణయాల అమలులో సరికొత్త ఆలోచనలు చేయాలని తెలిపారు.

Also Read: Delhi regional security dialogue: అఫ్గాన్ పరిణామాలపై భారత్ కీలక సదస్సు.. పాక్, చైనా డుమ్మా..

పాసింగ్ పరేడ్ ప్రారంభానికి ముందు ముఖ్య అతిథి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఐపీఎస్ అమరులకు నివాళులు అర్పించారు. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌కూ నివాళులు అర్పించారు. ఉన్నత విలువలు, ధైర్యం, ఐక్యత, టీమ్ వర్క్, సహనం, దయాభావం అన్నీ నేర్పడంలో సఫలమయ్యామని భావిస్తున్నట్టు నేషనల్ పోలీసు అకాడమీ డైరెక్టర్ అతుల్ కర్వాల్ ప్రారంభోపన్యాసంలో వివరించారు. ఫేజ్ వన్ ట్రైనింగ్‌లో ఫస్ట్‌గా నిలిచిన దర్పన్ అహ్లువాలియాకు అభినందనలు తెలిపారు. నేడు పాసింగ్ ఔట్ అవుతున్న ఈ శిక్షణ అధికారులు వారి వారి ఉద్యోగ జీవితాల్లో ఉన్నతంగా వ్యవహరిస్తారని, ఉన్నత ప్రమాణాలతో ప్రొఫెషనలిజాన్ని చూపిస్తారని భావిస్తున్నట్టు వివరించారు.

Also Read: అధికారుల సుపరిపాలనలోనే ప్రజాస్వామ్యం: హైద్రాబాద్‌లో అజిత్ ధోవల్

ఈ రోజు జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో 132 మంది ఐపీఎస్ శిక్షణ అధికారులున్నారు. ఇందులో 27 మంది మహిళా అధికారులు. కాగా, 17 మంది మిత్ర దేశాలకు చెందిన అధికారులున్నారు. ఇందులో భూటాన్ నుంచి ఆరుగురు, మాల్దీవుల నుంచి ఆరుగురు, నేపాల్ నుంచి ఐదుగురు ఈ అకాడమీలో ఫేజ్ వన్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఫేజ్ 1 శిక్షణ పూర్తవ్వడాన్ని దీక్షంత్ పరేడ్ అంటారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్