తోక మీద కొట్టి వదిలిపెట్టోద్దు... సీరియస్ గా టీఆర్ఎస్ పనిపట్టండి: ఈటల సంచలనం

By Arun Kumar PFirst Published Nov 12, 2021, 4:48 PM IST
Highlights

హుజురాబాద్ లో ఉపఎన్నికల్లో ఓడించి టీఆర్ఎస్ తోకమీద కొట్టారు... ఇక అలసత్వం చేయకుండా ఆ పార్టీ పనిపట్టాలని తెలంగాణ ప్రజలకు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. 

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇకపై కొనసాగటం తెలంగాణ సమాజానికే అరిష్టమని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కాబట్టి ప్రజలారా ఇంకా అలసత్వం వద్దు... సీరియస్ గా స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. తోక మీద కొట్టి వదిలిపెట్టవద్దకూడదు... టీఆర్ఎస్ పార్టీ పనిపట్టండని ఈటల పిలుపునిచ్చారు. 

Huzurabad Bypoll లో ప్రభుత్వ ప్రలోభాలకు లొంగకుండ పనిచేసిన వివిధ కులసంఘాల ప్రతినిధులను శుక్రవారం eatala rajender కలిసారు. తన గెలుపుకు సహకరించిన వారందరికి ఈటల కృతజ్ఞతలు తెలిపారు.  

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... ప్రపంచంలోనే అత్యధికంగా ధనప్రవాహం జరిగిన ఎన్నికల్లో హుజురాబాద్ ఒకటన్నారు. అధికార TRS Party తనను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేసిందని... ఇంతచేసినా ఓడించలేకపోయిందన్నారు. డబ్బులతో ఎన్నికల్లో గెలిచే సాంప్రదాయాన్ని CM KCR తెలంగాణ అంతటా వ్యాప్తిచేయడాని సిద్దంగా వున్నాడని ఈటల ఆరోపించారు. 

READ MORE  డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కుమార్తె వివాహానికి హాజరైన కేసీఆర్, ఈటల

''ప్రస్తుతం తెలంగాణలో సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఒకనాడు రాజకీయాలు సర్వీస్ కోణంలో ఉండేవి... కానీ వీటిని కేసిఆర్ వ్యాపారం చేశారు. హుజురాబాద్ ఓటర్లకు డబ్బులిచ్చి పసుపు కుంకుమ మీద, కుల దేవతల మీద ప్రమాణం చేయించారు'' అని ఆరోపించారు. 

''అస్తిత్వం, త్యాగశీలత, ఆత్మగౌరవంకి మారుపేరుగా తెలంగాణ ఉండేది... కానీ ఇప్పుడు డబ్బుల తెలంగాణ చేశారు కేసిఆర్. గొంతెత్తిన ప్రతి ఒక్కరినీ ఖతం పట్టిస్తున్నారు. ఉపఎన్నిక సమయంలో నాకు నరకం చూపించారు. కానీ ప్రజలంతా ధర్మం కోసం నాకు అండగా ఉన్నారు'' అని ఈటల పేర్కొన్నారు. 

''అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని చాలా మంది నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. సీఎం కేసిఆరే మిమ్మల్ని మాకు ఆయుధంగా అందించారని చెప్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనను అంతం చేయడానికి నా వంతుగా చేయాల్సిందంతా చేస్తాను'' అని ఈటల తెలిపారు.

READ MORE ఆరు కాదు.. నా తల 10 ముక్కలు నరుకు, డేట్ చెబితే.. ప్రగతిభవన్‌కే వస్తా : కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

ఇదిలావుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డినా ఈటలను ఓడించలేకపోయాయి. ఇలా కేసీఆర్ ఢీకొట్టి నిలిచిన ఈటల బిజెపి అధినాయకత్వం దృష్టిలో పడ్డాడని... ఆయనకు కీలక పదవి అప్పగించే యోచనలో వున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

టీఆర్ఎస్‌ పొలిటికల్ పంక్షనింగ్ తెలిసిన నాయకుడు, ప్రజాదరణ కూడా కలిగిన ఈటలను సమర్దవంతంగా ఉపయోగంచుకొని బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని బిజెపి యోచిస్తొందట. ఈ క్రమంలోనే ఆయనకు అప్పగించే పదవి విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న నేతల మనోభావాలు దెబ్బతినకుండా, వారిని తక్కువ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈటలకు ఓ కీలక పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. . టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొన్న ఈటలను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించాలని యోచిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది. ఇటీవలే జైలునుండి విడుదలైన తీన్మార్ మల్లన్నకు కూడా పార్టీ పదవి దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


 

click me!