మహాకూటమి: సీట్ల సర్ధుబాటులో‌ ప్రతిష్టంభన

By narsimha lodeFirst Published Sep 17, 2018, 3:45 PM IST
Highlights

మహా కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయమై  ప్రతిష్టంభన కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు విపక్షాలు మహాకూటమిగా ఏర్పాటై పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి

హైదరాబాద్: మహా కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు విషయమై  ప్రతిష్టంభన కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు విపక్షాలు మహాకూటమిగా ఏర్పాటై పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. ఈ మేరకు  పార్టీల మధ్య పొత్తుల చర్చలు సాగుతున్నాయి. అయితే ఎవరికివారు ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతున్నందున సీట్ల సర్ధుబాటు విషయమై ఇంకా కొలిక్కి రాలేదు.

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో  త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించాలంటే విపక్షాలన్నీ మూకుమ్మడిగా పోటీ చేయాలని భావించాయి. ఈ మేరకు మహాకూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి.

ఈ కూటమిలో  టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ పోటీ చేయనున్నాయి. కాంగ్రెస్ పార్టీ  75 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మిగిలిన 44 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించనుంది. 

అయితే  గెలిచే సీట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడ  ఇతర పార్టీలకు కేటాయించకూడదని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. తాము బలహీనంగా ఉన్న సీట్లనే ఇతర పార్టీలకు కేటాయించాలని ఆ పార్టీ  భావిస్తోంది.

ఎవరికి వారు  ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నాయి. దీంతో సీట్ల సర్ధుబాటుపై  పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదని సమాచారం.పొత్తులు కుదిరి సీఎంపీ ఏర్పడితేనే సీఎంపీ ఛైర్మెన్  పదవి విషయమై నిర్ణయం తీసుకోవాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.మరోవైపు సీఎంపీ ఛైర్మెన్ పదవి విషయంలో కూడ కాంగ్రెస్ పార్టీలో కూడ భిన్నాభిప్రాయాలు  వ్యక్తమౌతున్నాయి.

ఈ వార్తలు చదవండి

మహా కూటమి యత్నాలు: కోదండరామ్ షరతులివే

సిపిఐ, టీడీపి మధ్య పొత్తు ఖరారు: కాంగ్రెసుతోనూ మాట్లాడ్తామని రమణ ప్రకటన

కాంగ్రెస్‌కు షాక్: మహాకూటమికి టీడీపీ కసరత్తు, చాడకు ఎల్. రమణ ఫోన్

సీపీఐ, టీజేఎస్‌లకు టీడీపీ ఓకే: కాంగ్రెస్‌తో పొత్తుపై ఉత్కంఠ

40 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లపై గురి, కాంగ్రెస్ తొ పొత్తుపై టీడీపీ సస్పెన్స్

click me!