Hyderabad: తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్పందించారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తనకు సమాచారం ఇవ్వలేదనీ, ఆహ్వానించలేదని ఆమె పేర్కొన్నారు.
Telangana Governor Tamilisai Soundararajan: తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్పందించారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తనకు సమాచారం ఇవ్వలేదనీ, ఆహ్వానించలేదని ఆమె పేర్కొన్నారు. తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభం విషయంలో గవర్నర్లను గౌరవించని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ లో ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రారంభించిన తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌందరరాజన్ మాట్లాడుతూ సీఎం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నందున తనకు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వలేదనీ, ప్రతిపక్షాలు రాష్ట్రపతిని రాజకీయేతర వ్యక్తిగా సూచిస్తుంటే మీరు (ప్రతిపక్షం) గవర్నర్ల కోసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాగా, ప్రస్తుతం పార్లమెంట్ ప్రారంభోత్సవం గురించి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతున్న తరుణంలో తమిళిసై ఈ వ్యాఖ్యలు చేయడం ప్రధాన్యత సంతరించుకున్నాయి.
undefined
"ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్ ను అద్భుతంగా నిర్మించారనీ, దానిని సీఎం ప్రారంభించారని, గవర్నర్ ను ఆహ్వానించారా అని అందరూ ప్రశ్నించారు. (లేదు) ఎందుకంటే సీఎం పాలన సాగిస్తున్నారు. ఆ వేడుకకు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వలేదు (నాకు). రాష్ట్రపతి రాజకీయేతర వ్యక్తి అని మీరు (ప్రతిపక్షాలు) అంటున్నారు, కానీ గవర్నర్ల కోసం మీరు ఈ మాట ఎందుకు చెప్పడం లేదు?..." అని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు.
తమ రాష్ట్రాల్లో గవర్నర్లను గౌరవించని రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాజ్యాంగాధిపతిని ఆహ్వానించలేదని మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తనకు సమాచారం ఇవ్వలేదని, ఆహ్వానించలేదని సౌందరరాజన్ అన్నారు. కాగా, ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సౌందరరాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులుగా ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించాలన్న ప్రధాని నిర్ణయాన్ని బహిష్కరించాలని 21 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.