నారాయణపేట నల్లగట్టు వద్ద రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

By narsimha lode  |  First Published May 26, 2023, 9:21 AM IST

నారాయణపేట జిల్లా  మాగనూరు  మండలం నల్లగట్టు వద్ద  ఇవాళ  జరిగిన ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు



నారాయణపేట: జిల్లాలోని  మాగనూరు మండలం  నల్లగట్టు వద్ద  శుక్రవారంనాడు రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ  ఘటనలో  నలుగురు మృతి చెందారు. మృతదేహలను  స్థానిక  ప్రభుత్వఆసుపత్రికి తరలించారు  పోలీసులు . అతి వేగంగా  రెండు బైకులు ఢీకొనడంతో  ఈ ప్రమాదం  చోటు  చేసుకుంది.  

 దేశ వ్యాప్తంగా  పలు  ప్రాంతాల్లో  ఏదో ఒక ప్రాంతంలో  రోడ్డు ప్రమాదాలు  చోటు  చేసుకుంటున్నాయి.  అతి వేగం, డైవర్ల  నిర్లక్ష్యం, మద్యం మత్తులో  వాహనాలు నడపడంతో   రోడ్డు ప్రమాదాలు  చోటు చేసుకుంటున్నాయి. 

Latest Videos

ఈ నెల 19న   మెదక్ జిల్లా నార్సింగిలో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.  కారు, టిప్పర్ ఢీకొనడంతో  నలుగురు మరణించారు.ఈ నెల  20న  జోగులాంబ గద్వాల  జిల్లాలో  జరగిన  రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు. బొలెరో,  ఆటో ఢీకొనడంతో  ఈ ప్రమాదం  జరిగింది.ఈ నెల  23న  మెదక్ జిల్లా నార్సింగి వద్ద  జరిగిన  రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.  

ఆటో, కారు ఢీకొనడంతో   నలుగురు మృతి చెందారు.ఈ నెల  23న  తిరుమల ఘాట్  రోడ్డులో  ఎలక్ట్రిక్ బస్సు  బోల్తాపడింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు గాయపడ్డారు.  మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో ఈ నెల  24న  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.సిద్దిపేట  జిల్లాకు  చెందిన  నలగురు మృతి చెందారు.ఈ నెల  25న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  నెల్లూరు జిల్లా మనుబోలు మండలం  బద్దెవోలు  వద్ద కారు, కంటైనర్  ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 

click me!