తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా

By narsimha lodeFirst Published Jun 14, 2020, 5:27 PM IST
Highlights

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా సోకింది. ఆసుపత్రిలో చేరేందుకు ఆయన నిజామాబాద్ నుండి హైద్రాబాద్ కు బయలుదేరారు.
 

నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా సోకింది. ఆసుపత్రిలో చేరేందుకు ఆయన నిజామాబాద్ నుండి హైద్రాబాద్ కు బయలుదేరారు.

ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి కరోనా సోకింది. ముత్తిరెడ్డి యాదిగిరెడ్డితో పాటు ఆయన భార్య, డ్రైవర్, వంటమనిషికి కూడ కరోనా సోకింది. వీరిని కూడ క్వారంటైన్‌కి తరలించారు.నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి కూడ కరోనా సోకినట్టుగా వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరేందుకు హైద్రాబాద్ బయలుదేరారు.

also read:తెలంగాణ సచివాలయంలో మహిళా ఉద్యోగికి కరోనా: ఆసుపత్రిలో చికిత్స

మూడు రోజులుగా బాజిరెడ్డి గోవర్ధన్ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు.దీంతో ఆయన పరీక్షలు నిర్వహించుకొన్నాడు. ఈ పరీక్షల్లో ఎమ్మెల్యేకి కరోనా సోకినట్టుగా తేలింది.ఈ నెల 13వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 

నాలుగైదు రోజుల క్రితం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో బాజిరెడ్డి గోవర్ధన్ ఓ కార్యక్రమంలో హైద్రాబాద్ లో కలిసి పాల్గొన్నారని సమాచారం. మూడు రోజులుగా బాజిరెడ్డి గోవర్ధన్ కు జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు. బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు ఆయన భార్యకు పరీక్షలు నిర్వహించారు. గోవర్ధన్ కు మాత్రం పాజిటివ్ వచ్చింది. ఆయన భార్యకు మాత్రం నెగిటివ్ వచ్చినట్టుగా వైద్యులు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే భార్యను హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనుచరులతో పాటు అధికారులు కూడ క్వారంటైన్ కు వెళ్లనున్నారు. వీరికి కూడ వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారని సమాచారం. 

also read:తెలంగాణలో ఎమ్మెల్యేలకు కూడా పాకిన కరోనా, జనగామ ఎమ్మెల్యేకి పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు పీఏకు కరోనా సోకింది. దీంతో హరీష్ రావు కు పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్ వచ్చింది. అయితే మంత్రి హరీష్ రావు మాత్రం స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు.తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో నమోదౌతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నాయి.

click me!