తెలంగాణలో కరోనా విస్ఫోటనం: రికార్డు స్థాయిలో 253 కేసులు, 8 మంది మృతి

By Siva KodatiFirst Published Jun 13, 2020, 9:48 PM IST
Highlights

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శనివారం కనీవిని ఎరుగని స్థాయిలో ఒక్క రోజులో 253 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శనివారం కనీవిని ఎరుగని స్థాయిలో ఒక్క రోజులో 253 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక, ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,737కి చేరింది.

మరోవైపు కరోనా కారణంగా శనివారం తెలంగాణలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో... ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 182కి చేరుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,352 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిపోగా, 2,203 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇవాళ కేసుల్లో 179 హైదరాబాద్‌లోనే నమోదవ్వగా.. సంగారెడ్డి 24, మేడ్చల్ 14, రంగారెడ్డి 11, మహబూబ్‌నగర్ 4 , వరంగల్ 4, కరీంనగర్ 2, నల్గొండ 2, ములుగు 2, సిరిసిల్ల 2, మంచిర్యాలలో 2, సిద్ధిపేట, ఖమ్మం, మెదక్, నిజామాబాద్‌, నాగర్‌కర్నూలు, కామారెడ్డి, జగిత్యాలలో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. 

కరోనా కేసులు ఇప్పుడు హైదరాబాద్ తో పాటుగా మిగిలిన జిల్లాలకు కూడా వ్యాపిస్తుంది. గత కొన్ని రోజుల కింద వరకు హైదరాబాద్ లోనే నమోదవుతున్న కేసులు లాక్ డౌన్ సడలింపులు పుణ్యమాని జిల్లాలకు కూడా మరల వ్యాపించడం మొదలయింది. 

జహీరాబాద్ పరిధిలోని ఒకే కుటుంబంలోని 19 మందికి కరోనా వైరస్ సోకడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. 9వ తేదీన ఒక 55 సంవత్సరాల మహిళ ఆనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. 

అదే రోజు రామేతి ఆమహిళా అంత్యక్రియలను జహీరాబాద్ లో నిర్వహించారు. తెల్లారి వచ్చిన రిపోర్టులో ఆ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అప్రమత్తమైన అధికారులు ఆ మహిళా సమీప బంధువులు అందరినీ ఇసోలాటిన్ కేంద్రానికి తరలించారు. 

25 మంది కుటుంబ సభ్యుల సాంపిల్స్ ను కరోనా పరీక్షలకు పంపగా 19 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. కరోనా వైరస్ సోకినవారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు. 

click me!