Supreme Court: అరుదైన గౌరవం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పి. నిరూప్ రెడ్డి నియామకం

By Rajesh KFirst Published Dec 11, 2021, 5:17 PM IST
Highlights

Supreme Court:  ప్ర‌ముఖ సుప్రీం కోర్టు న్యాయ‌వాది పి నిరూప్ కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆయ‌న‌ను సుప్రీమ్ కోర్టు సీనియర్ న్యాయవాది గా ప్రకటిస్తూ.. అపెక్స్ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. వీరు ప్రముఖ న్యాయవాది, మాజీ స్పీకర్ & మాజీ మంత్రి శ్రీ పి రామచంద్రారెడ్డి గారి కుమారుడు. శ్రీ పి నిరూప్ గారు తెలంగాణ నుండి సుప్రీం కోర్ట్ గుర్తించిన మొదటి సీనియర్ న్యాయవాది. 
 

Supreme Court:  తెలంగాణకు చెందిన‌ న్యాయవాది పి. నిరూప్ కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పి. నిరూప్ నియ‌మ‌కం చేస్తూ.. భార‌త అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ప్రముఖ న్యాయవాది, మాజీ స్పీకర్ & మాజీ మంత్రి శ్రీ పి రామచంద్రారెడ్డి గారి కుమారుడు.  పి నిరూప్ రెడ్డి  తెలంగాణ నుండి సుప్రీం కోర్టు గుర్తించిన మొదటి సీనియర్ న్యాయవాది కావడం విశేషం. 


పి నిరూప్ కు సుప్రీం కోర్టులో న్యాయవాదిగా 30 యేండ్లు పని చేసిన అనుభ‌వ‌ముంది. జాతీయ ప్రాముఖ్యత పొందిన ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా, ఎన్విరాన్‌మెంటల్ లా, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ లా, ల్యాండ్ రంగాలలో   తీర్పులను నివేదించారు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలు, రాజ్యాంగ చట్టాలపై సుదీర్ఘ వాదనలు వినిపించారు. అత్యున్నత న్యాయస్థానంలో మూడు దశాబ్దాలుగా  అనుభ‌వం ఉన్నా ఆయ‌న ఎన్నో హోదాల‌లో ప‌నిచేశారు.

Read Also: https://telugu.asianetnews.com/national/goa-polls-tmc-promises-rs-5000-to-a-woman-of-every-household-per-month-r3y877

మాజీ అడ్వకేట్-జనరల్, అదనపు సొలిసిటర్-జనరల్ ఆఫ్ ఇండియా V.R.రెడ్డి, మాజీ సొలిసిటర్-జనరల్ ఆఫ్ ఇండియా గోపాల్ సుబ్రమణ్యం వద్ద సుదీర్ఘ కాలం పని చేసిన అనుభ‌వం ఉంది. 2013-2016 మ‌ధ్య‌కాలంలో సుప్రీంకోర్టులో గోవా , ఢిల్లీ కి చెందిన వారికి  సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌ న్యాయవాదిగా కూడా పని చేశారు. ఢిల్లీ, మేఘాలయల‌కు అదనపు అడ్వకేట్-జనరల్‌గా కూడా పనిచేశారు. పి నిరూప్ ప్ర‌స్థానం ముఫోసిల్ కోర్టు నుండి ప్రారంభమైంది. క్ర‌మంగా అంచెలంచెలుగా ఎదుగుతూ.. సుప్రీం కోర్టు వ‌ర‌కు సాగింది. ప్ర‌స్తుతం ఆయ‌న సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదిగా నియ‌మితులు కావ‌డం విశేషం.

click me!