
వైద్యులు దేవుళ్లతో సమానం అంటారు. అలాంటి వైద్య వృత్తిలో ఉన్న ఓ నర్సుపై ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఓ సంస్థలో నర్స్‌గా పని చేస్తూ జీవిస్తున్న మహిళతో ఆ సంస్థ యజమాని నీచంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని శుక్రవారం అరెస్టు చేశారు.
ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ భర్త... భార్య ఏం చేసిందంటే...
పంజాగుట్టలో ఉన్న ఓ హోమ్ కేర్ సర్వీస్ సెంటర్‌లో బాధితురాలు నర్స్‌గా పని చేస్తోంది. ఆమెకు 2012 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే భార్య భర్తల మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల ఆమె భర్తతో విడిగా ఉంటోంది. మూడేళ్ల నుంచి హోం కేర్ సర్వీస్ సెంటర్‌లో పని చేసే ఆ మహిళ.. ఆ సంస్థ సూచించిన వారి ఇళ్లకు వెళ్లి ట్రీట్‌మెంట్ ఇచ్చి వస్తుంటుంది. ఆ సంస్థ యజమాని మల్లెల సాయి నవంబర్ 7వ తేదీన ఆ మహిళకు పోన్ చేశాడు. విజయవాడకు వెళ్లాలలని వెంటనే ఆఫీసుకు రావాలని సూచించాడు. నమ్మి వెళ్లిన ఆమెకు ఆఫీసులో ఎవరూ కనిపించలేదు. దీంతో అతడు నర్స్‌ను పైప్లోర్ లో ఉండే గదికి తీసుకెళ్లి..అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, చెప్తే చంపేస్తానని అన్నాడు. అనంతరం కొంత సమయం తరువాత నర్స్‌ను జూబ్లీ బస్టాండ్‌లో విజయవాడ బస్సు ఎక్కించాడు. కొన్ని రోజులు నర్స్ కొంత అనారోగ్యానికి గురైంది. దీంతో అతడికి ఫోన్ చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చినట్టు అనుమానంగా ఉందని చెప్పింది. అతడు అబార్షన చేయించుకోవాల్సిందిగా నర్స్‌కు సూచించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెరించాడు. దీంతో ఏం చేయాలో తెలియక భయంతో పోలీసులను ఆశ్రయించింది. న్యాయం చేయాల్సిందిగా వేడుకొంది. ఆమెను నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు శుక్రవారం నింధితుడు సాయిని అరెస్టు చేశారు.