పచ్చబొట్టు ఆధారంగా నవీన్ డెడ్‌బాడీ గుర్తింపు: తండ్రి శంకర్ నాయక్

By narsimha lode  |  First Published Mar 7, 2023, 12:20 PM IST

తన  కొడుకు నవీన్  ను హత్య  చేసిన హరిహరకృష్ణను ఉరి తీయాలని  శంకర్ నాయక్   డిమాండ్  చేశారు



హైదరాబాద్:  చేతిపై  ఉన్న పచ్చబొట్టు ఆధారంగా  డెడ్ బాడీ నవీన్ దేనని గుర్తించామని  తండ్రి  శంకర్ నాయక్  చెప్పారు. నవీన్  హత్యకు గురైన విషయం  తెలిసిన తర్వాత  సంఘటన స్థలంలో   చూస్తే  డెడ్ బాడీ గుర్తించలేనంతగా మారిపోయిందన్నారు.   మృతదేహం  చేతిపై  ఉన్న టాటూ ఆధారంగా  ఈ డెడ్ బాడీ  నవీన్ దేనని  తాము గుర్తించామని శంకర్ నాయక్  చెప్పారు. 

తన సోదరుడు చనిపోవడంతో  అతని అంత్యక్రియలకు   హజరు కావాలని  నవీన్ కు  ఫోన్  చేస్తే  అతని  ఫోన్  స్విచ్ఛాప్  వచ్చిందని శంకర్ నాయక్  చెప్పారు. అంత్యక్రియలు ఇతర  కార్యక్రమాలతో   బిజీగా ఉంటూనే నవీన్  కోసం  అతని స్నేహితులకు కూడ ఫోన్లు  చేసినట్టుగా  శంకర్ నాయక్  చెప్పారు.  

Latest Videos

నవీన్  ఇంటికి వచ్చాడా అని   హరిహరకృష్ణ  తమకు ఫోన్  చేసి అడిగినట్టుగా  శంకర్ నాయక్  చెప్పారు.  హైద్రాబాద్ లో  ఫిర్యాదు  చేద్దామని  తమను హైద్రాబాద్  కు పిలిపించాడన్నారు.  కానీ   తాము హైద్రాబాద్  కు చేరుకున్న తర్వాత  హరిహరకృష్ణ ఫోన్  స్విచ్ఛాఫ్  చేసి ఉందన్నారు.    

తన కొడుకు కన్పిచండం లేదని  నార్కట్ పల్లి  పోలీసులకు  ఫిర్యాదు  చేసినట్టుగా  శంకర్  నాయక్  మీడియాకు  చెప్పాడు.   గత నెల  21వ తేదీన  తాము  పోలీసులక ఫిర్యాదు  చేసినట్టుగా  శంకర్ నాయక్ తెలిపారు. 

హరిహరకృష్ణ ఒక్కడే   నవీన్ ను హత్య  చేసి ఉంటాడని తాను  భావించడం లేదన్నారు.  హరిహరకృష్ణ కు  ఇతరులెవరైనా సహకరించి ఉండొచ్చని  ఆయన అనుమానం  వ్యక్తం  చేశారు.  నవీన్  ను హత్య చేసిన  హరిహరకృష్ణను కఠినంగా శిక్షించాలని  శంకర్ నాయక్  కోరుతున్నారు. నమ్మించి  తన కొడుకును రప్పించి  హరిహరకృష్ణ హత్య చేశాడని  శంకర్ నాయక్  ఓ తెలుగు న్యూస్ చానెల్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో  చెప్పారు.   

also read:నవీన్ హత్య కేసు: హరిహరకృష్ణ లవర్, హసన్ లకు రిమాండ్, జైలుకు తరలింపు

గత  నెల  17వ  తేదీన  నవీన్ ను  హరిహరకృస్ణ హత్య చేశాడు.  వారం రోజుల తర్వాత   అబ్దుల్లాపూర్ మెట్  పోలీసులకు  హరిహరకృష్ణ లొంగిపోయాడు. ఈ వారం రోజుల సమయంలో   నవీన్  కోసం  హరిహరకృష్ణకు  ఫోన్  చేస్తే  తన వద్ద లేడని  హరిహరకృష్ణ సమాధానం  ఇచ్చాడు.  నవీన్  కోసం  హరిహరకృష్ణ కూడా  వాకబు చేసేవాడు.  నవీన్  ఆచూకీ  దొరకకపోతే  పోలీసులకు ఫిర్యాదు  చేద్దామని కూడా  సలహ ఇచ్చిన విషయాన్ని  నవీన్  బంధువులు  గుర్తు  చేస్తున్నారు. 
 

click me!