Nampally fire Accident: అగ్ని ప్రమాదాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కిషన్ రెడ్డి

By Mahesh Rajamoni  |  First Published Nov 14, 2023, 5:01 AM IST

Kishan Reddy: నాంప‌ల్లి అగ్నిప్ర‌మాదం ఘటనపై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ బీజేపీ ఆరోపించింది.
 


Hyderabad fire Accident: హైద‌రాబాద్ న‌గ‌రంలోని నాంపల్లిలోని నివాస భ‌వ‌నంలోని ఓ కెమికల్ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంత్రి ప్రాణాలు కోల్పోవ‌డంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమన్నారు. నివాస ప్రాంతం కంటే ముందుగా కెమికల్‌ గోడౌన్‌ ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. రెసిడెన్షియల్‌లో కెమికల్‌ గోడౌన్‌ల వల్ల అగ్ని ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయనీ, తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు లేఖలు రాశామని కిషన్‌రెడ్డి తెలిపారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కిష‌న్ రెడ్డి ఆరోపించారు.

ఈ ప్ర‌మాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి, విచారణ డిమాండ్

Latest Videos

undefined

హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన ఘటనపై అంశం గురించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర విచారం , దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామనీ, క్షతగాత్రులకు సమగ్ర వైద్య సహాయం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. మరో రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ప్రతిస్పందన యంత్రాంగాల ప్రభావం, దిద్దుబాటు చర్యలను సూచించిన నివేదికను నివేదిక కవర్ చేయాలని భావిస్తున్నారు. ఈ దురదృష్టకర ప్రమాదం తర్వాత సత్వర స్పందన, నిర్వహణలో కొనసాగుతున్న ప్రయత్నాలకు అన్ని ఏజెన్సీలు, బాధ్యతగల పౌరులకు గవర్నర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

నాంప‌ల్లి అగ్నిప్ర‌మాదంలో 9 మంది మృతి

నాంపల్లిలోని బజార్‌ఘాట్ లోని నివాస భవనంలో సోమవారం ఉదయం మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది మృతి చెందారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భవనంలోని సెల్లార్‌లో మెకానిక్‌ కారు మరమ్మతులు చేస్తుండగా నిప్పురవ్వ చెలరేగడంతో మంటలు చెలరేగడంతో కొంత కంటైనర్‌లో నిల్వ ఉంచిన డీజిల్‌కు మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. సెల్లార్‌లో నిల్వ చేసిన కొన్ని రసాయన డ్రమ్ములకు కూడా మంటలు వ్యాపించ‌డంతో దట్టమైన పొగ, తరువాత భారీ మంటలు చెల‌రేగాయి. పొగ‌, మంట‌ల్లో చిక్కుకుని ఊపిరాడ‌క 9 మంది చ‌నిపోయారు.

click me!