ఎస్సీ వర్గీకరణపై ప్ర‌ధాని మెడీ కామెంట్స్ పై కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

By Mahesh Rajamoni  |  First Published Nov 14, 2023, 3:19 AM IST

Telangana BJP: హైదరాబాద్ లో జరిగిన భారీ ఒక‌ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఎస్సీ (మాదిగ‌) కులాల వర్గీకరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నిర్వ‌హించిన ఈ ర్యాలీలో పీఎం చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 
 


Telangana BJP President G. Kishan Reddy: ఎస్సీ వర్గీకరణకు ప్రధాని న‌రేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని తెలంగాణ  భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి అన్నారు. మోడీ హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని త‌ప్ప‌కుండా నెరవేరుస్తామ‌ని అన్నారు. దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణ సమస్యను ప్రధాని మోడీ ప్రకటించగానే ప్రతిపక్షాలు భయపడిపోయాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని కాంగ్రెస్ చెప్పినా చేసిందేమీ లేదని విమ‌ర్శించారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నదే ప్రధాని మోడీ ప్రయత్నమని కిషన్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై గతంలోని కమిటీల‌ను గురించి ప్ర‌స్తావించారు.

ఏళ్ల తరబడి సమస్యను కాంగ్రెస్‌ కోల్డ్‌ స్టోరేజీలో పెట్టిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై ఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయలేదన్నారు. ఇందులో కాంగ్రెస్ మొదటి ముద్దాయిగా అభివ‌ర్ణించారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం త‌ప్ప‌కుండా కమిటీ వేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని  బీజేపీ సంపూర్ణంగా సమర్థిస్తుందని కూడా కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామ‌నీ, కొందరు రాజకీయ నాయకులు కోడి గుడ్డుపై ఈకలు పీకినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణపై న్యాయం జరిగేలా అన్ని విధాలుగా సహకరిస్తానని కిషన్ రెడ్డి తెలిపారు.

Latest Videos

ఇదిలావుండ‌గా, హైదరాబాద్ లో జరిగిన భారీ ఒక‌ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఎస్సీ (మాదిగ‌) కులాల వర్గీకరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నిర్వ‌హించిన ఈ ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ ఈ అంశం ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అధికార బీఆర్ఎస్ రెండూ షెడ్యూల్డ్ కులాల విష‌యంలో హామీల‌ను నిల‌బెట్టుకోలేద‌ని విమ‌ర్శించిన ప్ర‌ధాని మోడీ.. ఆయా వ‌ర్గాల‌కు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేసిన అన్యాయాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

ఎస్సీ సబ్ గ్రూపుల వర్గీకరణ ఎమ్మార్పీఎస్ ప్రధాన డిమాండ్ కాగా, దానికి కమిటీ వేస్తామని మోడీ ఇచ్చిన హామీ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను భావోద్వేగానికి గురిచేసింది. "బీఆర్ఎస్ దళిత వ్యతిరేకి అని, కాంగ్రెస్ కూడా వారిలాగే ఉందన్నారు. రెండు ఎన్నికల్లో అంబేడ్కర్ ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే బీజేపీ విధానం ప్రకారం మాదిగ సోదరులను ముందుకు తీసుకెళ్తామన్నారు. అణగారిన వర్గాల్లో పేదరిక నిర్మూలనకు బీజేపీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు.

click me!