బీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు

By narsimha lode  |  First Published Feb 29, 2024, 5:00 PM IST


బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ ఎంపీ  పి. రాములు బీజేపీలో చేరారు.


హైదరాబాద్: నాగర్ కర్నూల్ ఎంపీ  పి. రాములు  గురువారంనాడు  భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. 2019 ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పి. రాములు పోటీ చేసి విజయం సాధించారు.  ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  బీఆర్ఎస్ ను వీడాలని  నిర్ణయం తీసుకున్నారు. దరిమిలా  పి. రాములు  ఇవాళ న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు.కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ తెలంగాణ ఇంచార్జీ  తరుణ్ చుగ్ లు పి. రాములుకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు.  

also read:తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

Latest Videos

undefined

ఇప్పటికే  పెద్దపల్లి ఎంపీ వెంకటేష్  బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మరో వైపు  నాగర్ కర్నూల్ ఎంపీ  పి. రాములు  బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  తెలంగాణ రాష్ట్రంపై  బీజేపీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని  17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ  స్థానాలను దక్కించుకోవాలని  బీజేపీ వ్యూహారచన చేస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలపై ఇతర పార్టీలపై ఫోకస్ పెట్టింది.

also read:కోటి ఇళ్లకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్: రూ. 75 వేల కోట్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ విజయం సాధించింది.  పార్లమెంట్ ఎన్నికలపై కూడ  కాంగ్రెస్ కేంద్రీకరించింది. రెండంకెల్లో స్థానాలు దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు  ప్రయత్నిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో  బీజేపీ నాలుగు స్థానాల్లో  విజయం సాధించింది.  కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం  ఒక్క స్థానంలో విజయం సాధించింది.  మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 

 

click me!