
కాంగ్రెస్ నాయకుడు, మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినాయకుడు కే చంద్రశేఖర్ రావుకు సంచలన లేఖ రాశారు. మహబూబ్ నగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు. తనకు రాజకీయ పునర్మజన్మ ఇచ్చిన మహబూబ్ నగర్ అంటే కేసీఆర్‌కు నచ్చదని పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో వారు ఏ తప్పు చేయలేదని చెప్పై ధైర్యం ఉంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
Also Read: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి తప్పిన ముప్పు.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
మహబూబ్ నగర్ ప్రజల కన్నీటి గాధలు అనంతం అని వంశీచంద్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా నీటిని కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా వినియోగించలేకపోయిందని ఆరోపణలు చేశారు. కేసీఆర్ అమసర్థత వల్లే కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొననారు. రేపు సాయంత్రం మహబూబ్ నగర్‌లో బీఆర్ఎస్ బండారం అంతా బయట పెడతానని వార్నింగ్ ఇచ్చారు.