మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుదామని కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ కామెంట్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి స్థానంలో తేల్చుకుందాం.. అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ రోజు మీడియాతో చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రా.. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం అని అన్నారు. తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని పేర్కొన్నారు.
తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తానని, రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మల్కాజ్‌గిరి నుంచి తనపై పోటీకి రావాలని సవాల్ చేశారు. సిద్ధమా? అని ప్రశ్నించారు.
Also Read : నాపై పోటీ చేసి గెలవాలి : కేసీఆర్‌కు వంశీచంద్ రెడ్డి సవాల్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చి 31వ తేదీలోపు మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్ చేయాలని కేటీఆర్ అన్నారు. లేదంటే.. పంటకు సాగు నీరు అందదని పేర్కొన్నారు. ఇక మేడిగడ్డ వద్దకు తాము వెళ్లితే.. కాంగ్రెస్ పార్టీ పాలమూరు వద్ద కు వెళ్లి రాజకీయం చేయాలని చూస్తున్నదని ఫైర్ అయ్యారు.