మల్లారెడ్డి బండారం బయటపెడ్తా: బజారుకెక్కిన మేడ్చల్ లొల్లి

By telugu teamFirst Published Jan 16, 2020, 11:28 AM IST
Highlights

టీఆర్ఎస్ నేత రాపోలు రాములు, మంత్రి మల్లారెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చెల్ మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికలో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాపోలు రాములు దుయ్యబడుతున్నారు.

మేడ్చల్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వివాదం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అగ్గి రాజేస్తోంది. నేతల మధ్య విభేదాలు బజారుకెక్కాయి. మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత రాపోలు రాములుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులు బయటకు వచ్చాయి. ఫోన్ సంభాషణల రికార్డులు సంచలనం సృష్టిస్తున్నాయి.

తన వర్గానికి చెందినవారికి టికెట్లు ఇవ్వలేదని రాపోలు రాములు మంత్రి మల్లారెడ్డిపై విరుచుకుపడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో తనతో చర్చించకుండా మల్లారెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని రాపోలు రాములు మండిపడ్డాడు. 

Also Read: 1100 వార్డుల్లో ఆపార్టీలకు అభ్యర్థుల్లేరు, 84 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం

తన వర్గానికి చెందినవారికి ఎవరికి టికెట్లు ఇచ్చావో చెప్పాలని రాములు మల్లారెడ్డిని నిలదీశారు. తొందరపడవద్దని మల్లారెడ్డి చెప్పినా ఆయన వినలేదు. నీ వ్యవహారమంతా టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర రెడ్డికి చెప్తానని ఆయన మల్లారెడ్డిని హెచ్చరించారు. రేపో ఎల్లుండో పల్లా రాజేశ్వర రెడ్డి వద్దకు వెళ్తానని ఆయన చెప్పారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా మల్లారెడ్డి చెప్తానని రాపోలు రాములు మల్లారెడ్డితో చెప్పారు. చెప్పు.. పో అంటూ మల్లారెడ్డి ఆయనకు జవాబిచ్చారు. తాను 12వ వార్డు అడిగానని, ఇవ్వలేదని రాములు మల్లారెడ్డిని నిలదీశారు.

Also Read: సీఏఏకు అనుకూలంగా పతంగులు ఎగురవేసిన తెలంగాణ బీజేపీ

రమేష్ కు ఎందుకు టికెట్ ఇవ్వలేదని రాపోలు రాములు మల్లారెడ్డిని నిలదీశారు. ఆయన ఒక్కసారి కూడా తన వద్దకు రాలేదని మల్లారెడ్డి జవాబిచ్చారు. ప్రజల మధ్య ఉండాలా, నీ చుట్టూ తిరగాలా అని రాములు ప్రశ్నించారు. సముదాయించాలి కదా అని మల్లారెడ్డి అన్నారు.

మల్లారెడ్డికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, పోలీసులకు పట్టిస్తానని రాపోలు రాములు హెచ్చరించారు. తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని కూడా అన్నారు. ప్రాణం పోయినా ఫరవా లేదు, మల్లారెడ్డి బండారం బయట పెడుతానని ఆయన అన్నారు.

click me!