పూణెలో టెక్కీ రోహిత : బంధువులకు అప్పగించనున్న పోలీసులు

By narsimha lodeFirst Published Jan 15, 2020, 1:47 PM IST
Highlights

తెలుగు టెక్కీ రోహిత ఆచూకీని పూణెలో కనుగొన్నారు. బుధవారం నాడు పోలీసులు రోహితను హైద్రాబాద్ కు తీసుకురానున్నారు.


హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఇంట్లోంచి వెళ్లిపోయిన టెక్కీ రోహిత ఆచూకీని పూణెలో కనిపెట్టారు పోలీసులు. బుధవారం నాడు సాయంత్రం పూణె నుండి రోహితను హైద్రాబాద్‌కు తీసుకు రానున్నారు పోలీసులు.

Also read:హైదరాబాద్ లో మహిళా టెక్కీ మిస్సింగ్.... 11 రోజులుగా కనిపించకుండాపోయి..

గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన ఇంట్లో నుండి టెక్కీ రోహిత వెళ్లిపోయింది.ఆపిల్ కంపెనీలో రోహిత సాప్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తోంది.పూణెలో యాపిల్ కంపెనీలో రోహిత గుర్తింపు కార్డులు, ఏటీఎం కార్డులను ఇంట్లోనే వదిలి వెళ్లింది రోహిత ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.

తొలుత సికింద్రాబాద్ సమీపంలో సీసీటీవీ పుటేజీలో రోహిత కన్పించినట్టుగా పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే సీసీటీవీ పుటేజీలో లభించిన దృశ్యాలను చూసిన కుటుంబసభ్యులు ఆమె రోహిత కాదని తేల్చి చెప్పారు.

దీంతో మరోసారి రోహిత కోసం గచ్చిబౌలి పోలీసులు గాలింపును మరింత తీవ్రం చేశారు. కుటుంబ కలహాల కారణంగానే రోహిత ఇంటి నుండి  వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.

బుధవారం నాడు పూణెలో రోహిత ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే రోహితతో పూణెలో రోహితతో మాట్లాడినట్టుగా సమాచారం. హైద్రాబాద్‌కు వచ్చేందుకు రోహిత నిరాకరించినట్టుగా సమాచారం.పూణెలోనే రోహితను బంధువులకు అప్పగించాలని పోలీసులు భావిస్తున్నారు. 


 

click me!