హైద్రాబాద్‌లో కారు బీభత్సం: ఇద్దరి పరిస్థితి విషమం

Published : Jan 16, 2020, 08:23 AM IST
హైద్రాబాద్‌లో కారు బీభత్సం: ఇద్దరి పరిస్థితి విషమం

సారాంశం

హైద్రాబాద్ లో గురువారం నాాడు కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

హైదరాబాద్:హైద్రాబాద్ రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు ఉదయం కారు బీభత్సం సృష్టించింది.ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్ డిపో వద్ద అతి వేగంగా ఓ కారు దూసుకు వచ్చింది. స్పీడును కంట్రోల్ చేయలేకపోవడంతో కారు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు ఎవరిది, కారు నడుపుతున్నవారు ఎవరనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులో కారును వేగంగా నడిపారా లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్