మోడీ, కేసీఆర్ కుమ్మక్కు .. సింగరేణిని అదానీకి అమ్మాలని కుట్ర , అడ్డుకుంటాం : రాహుల్ గాంధీ

By Siva Kodati  |  First Published Oct 19, 2023, 6:03 PM IST

కేసీఆర్, మోడీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు . కేసీఆర్, మోడీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారని.. వారి ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని ఆయన తెలిపారు.


కేసీఆర్, మోడీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు . గురువారం పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కేసీఆర్, మోడీ కలిసి సింగరేణిని అదానీకి అమ్మాలని చూశారని అన్నారు.  మోడీ, కేసీఆర్ ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని ఆయన తెలిపారు. సింగరేణి ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కేసీఆర్ లాగే మోడీ కూడా అబద్ధాలు చెప్పి గెలిచారని .. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోడీ అన్నారని, మరి వేశారా అని ఆయన ప్రశ్నించారు. 

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోడీ చెప్పారని.. మరి ఉద్యోగాలు వచ్చాయా అని రాహుల్ గాంధీ నిలదీశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన తెలిపారు. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని.. గ్యాస్ ధరలు పెంచి మోడీ ప్రభుత్వం పేదలపై భారం మోపిందని రాహుల్ దుయ్యబట్టారు. ఒక కుటుంబంతో వుండే అనుబంధం తనకు తెలంగాణతో వుందన్నారు. 

Latest Videos

Also Read: రాహుల్‌కు నేటికీ ఇల్లు లేదు.. కేసీఆర్ కుటుంబానికి వందల ఎకరాలు, వేలు కోట్లు : రేవంత్ రెడ్డి

నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీకి తెలంగాణతో మంచి అనుబంధం వుందని రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన హామీని సోనియా గాంధీ నెరవేర్చారని రాహుల్ అన్నారు. రాజకీయంగా పార్టీకి నష్టమని తెలిసినా, తెలంగాణ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని.. ప్రజల తెలంగాణను దొరల తెలంగాణగా మార్చాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 

కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును లూటీ చేసిందని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే రూ.లక్ష కోట్లు దోచుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రాజెక్ట్‌లతో కేసీఆర్, కాంట్రాక్టర్లకే ప్రయోజనం కలిగిందని.. కంప్యూటరైజ్డ్ చేస్తున్నామని చెప్పి పేదల భూములను కేసీఆర్ లాక్కొన్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఈ పదేళ్లలో నెరవేర్చారా అన్నది ఆలోచించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. డబుల్ బెడ్ రూం ఇల్లు ఎంతమందికి ఇచ్చారు.. లక్ష రుణమాఫీ ఎంతమందికి చేశారు..  భూస్వాములు, ధనవంతులకు మేలు చేసేందుకే రైతుబంధు తెచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

click me!