రేపు ఢిల్లీకి రాహుల్: ఆర్మూర్ లో ముగియనున్న కాంగ్రెస్ బస్సు యాత్ర

By narsimha lodeFirst Published Oct 19, 2023, 4:51 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ బస్సు యాత్రలో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు నిజామాబాద్ లో  రాహుల్ గాంధీ బస్సు యాత్ర రద్దైంది. 


హైదరాబాద్:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  నిజామాబాద్ జిల్లా పర్యటన రద్దైంది.  న్యూఢిల్లీలో అత్యవసర సమావేశం కారణంగా రాహుల్ గాంధీ పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి.  రేపు ఆర్మూర్ లో  పసుపు రైతులతో సమావేశం తర్వాత  హైద్రాబాద్ చేరుకుని అక్కడి నుండి రాహుల్ గాంధీ న్యూఢిల్లీకి వెళ్తారు.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని  కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి  ప్రియాంక గాంధీలు నిన్న బస్సు యాత్రను నిన్న ములుగులో ప్రారంభించారు. బస్సు యాత్ర తర్వాత మహిళా డిక్లరేషన్ ను విడుదల చేసిన తర్వాత ప్రియాంక గాంధీ ఢిల్లీ వెళ్లి పోయారు. ఇవాళ  రెండో రోజు రాహుల్ గాంధీ భూపాలపల్లి నుండి పెద్దపల్లి వరకు బస్సు యాత్ర నిర్వహించారు రాహుల్ గాంధీ.

ఇవాళ రాత్రికి కరీంనగర్ లో  రాహుల్ గాంధీ బస చేస్తారు. రేపు  కరీంనగర్ నుండి ఆర్మూర్ కు రాహుల్ గాంధీ వెళ్తారు. ఆర్మూర్ లో పసుపు రైతులతో సమావేశం తర్వాత  రాహుల్ గాంధీ హైద్రాబాద్ నుండి  న్యూఢీల్లీకి తిరిగి వెళ్లనున్నారు.రేపు సాయంత్రం నిజామాబాద్  సభలో పాల్గొని రాహుల్ గాంధీ న్యూఢిల్లీకి తిరిగి వెళ్లాలి. అత్యవసర సమావేశం కారణంగా  రాహుల్ గాంధీ  రేపు మధ్యాహ్ననికే  ఢిల్లీ వెళ్తారు.

also read:తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోంది: మంథనిలో రాహుల్ గాంధీ

తెలంగాణలో  ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహించింది.  కర్ణాటక ఫార్మూలాను తెలంగాణలో అమలు చేస్తుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు దఫాలు కాంగ్రెస్ అధికారానికి  దూరంగా ఉంది.  దీంతో ఈ దఫా  అధికారాన్ని దక్కించుకొనేందుకు అన్ని రకాల  అస్త్రాలను ఆ పార్టీ ఉపయోగిస్తుంది

click me!