హైదరాాబాద్ కు జలగండాలు

First Published Nov 14, 2016, 4:05 AM IST
Highlights

వాాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల   ముందు ముందు హైదరాబాద్ లో వానల జోరు తీరు వరదలకు దారితీసే ప్రమాదం ఉందని ఇపిటిఆర్ ఐ చెబుతున్నది

హైదరాబాద్ వరద కష్టాలు తీరడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.

 

వాతావరణంలో వస్తున్న తీవ్రమయిన మార్పులు పెనువర్షాలై, వరదలై హైదరాబాద్ ను తలకిందులు చేయనున్నాయి. ఈ హెచ్చరిక చేస్తున్నది,  ప్రభుత్వానికి చెందిన పర్యావరనణ పరిరక్షణ, పరిశోధన,శిక్షణ సంస్థ (ఇపిటిఆర్ ఐ).

 

ఎపుడో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఏర్పాటయిన  ఈ సంస్థ దేశంలోనే విశిష్టమయినది. చాలా ప్రమాణాలతో నడిచే సంస్థ ఇది. వాతావరణలో వచ్చిన మార్పులు హైదరాబాద్ నగరం మీద ఎలాంటి దుష్ప్ర భావాన్ని చూపిస్తాయి, వాటిని తట్టుకునే శక్తి  ఈ నగరానికి ఉందా  లేకపోతే  ఏంచేయాలనేదాని మీద ఈ సంస్థ  ఒక కాన్సెప్టపేపర్ తయారు చేసి రాష్ట్ర అటవీ శాఖకు అందించింది.

 

ఇటీవల వర్షాలలో హైదరాబాద్ నగరంలోని అనేక  కాలనీలు మునిగిపోయి, రోడ్లన్నీ కొటక్టుకుపోయి, ఛిన్నాభిన్నం కావడానికి  కారణం  వాతావరణంలో వచ్చిన మార్పులకు నగరం తట్టుకోలేక పోవడమేనట.

 

ఈ గండం వెంటనే రోడ్లను మరమ్మతు చేయడంతోనో, లేదా పూడిపోయిన  మరుగుకాలువలను బాగు చేయడంతోనో పరిష్కారం కాదని,ముందు ముందు జలగండాలు  చాలా ఉన్నాయని, వాటిని తట్టుకునేందుకు హైదరాబాద్ సిద్ధంగా కావాలని ఈ కాన్సెప్ట్ పేపర్లో పేర్కొన్నట్లు తెలిసింది.

 

జల గండాలెందుకొస్తున్నాయి...

 

పర్యావరణ మార్పుల కారణంగా హైదరాబాద్ నగర ఉష్ణోగ్రత  పెరుగుతూ పోతున్నది. ఇంకో నాలుగేళ్ల లో హైదరాబాద్‌లో సగటు ఉష్ణోగ్రత 1.17 డిగ్రీలు పెరుగుతున్నది. చూసేందుకు ఇది చాలా చిన్న సంఖ్యయే. కాని దీని ప్రభావం  చాలా తీవ్రంగా ఉంటుందట.దీని వల్ల రాజధానికి వర్ష తాకిడి తీవ్రమవుతుంది. ఏటా కురిసే వర్షాలతో పాటు ఉధృతి కూడ పెరుగుతుందని ఈ సంస్థ అధ్యయనంలో తేలింది. వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం అధ్యయనం చేసి ప్రత్యేకంగా తెలంగాణా యాక్షన్‌ప్లాన్ తయారు చేసినట్లు సంస్థ డైరెక్టర్ జనరల్ బీ కల్యాణ్ చెబుతున్నారు.

 

సమీప భవిష్యత్తులో వానలు భారీగా ఉండే అవకాశం ఉన్నందు వల్ల , వర్షపు నీరు ప్రళయం సృష్టించకుండా ఉండేందుకు రాజధాని మౌలిక వసతులను ముందు పటిష్టం చేసుకోవాలని  ఆయన అంటున్నారు.

 

రాజధాని వాన జోరు

 

2003 లో రాజధానిలో గంటకు 20 మిల్లీమీటర్ల తీవ్రతతో  23 సార్లు వర్షాలు కురిశాయి.  క్రమంగా వాటి సంఖ్య , తీవ్రత పెరుగుతూ వచ్చింది.  2005లో 28సార్లు, 2008లో 36 సార్లు వానలు పడ్డాయి.  సమీప భవిష్యత్తులో గంటకు 40 మిల్లీమీటర్ల తీవ్రతతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంత వర్షం నీటి ప్రవాహానికి ఎక్కడ అడ్డంకులు లేకుండా ఉండాలి.  ఈ వరద నీటిని తీసుకువెళ్లేందుకు వ్యవస్థ.  హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ గంటకు 12 మిల్లీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకునేలా మాత్రమే  నిర్మితమైంది.  ఇపుడు ప్రతి వర్షం ఒక వరదగా మారి అనేక కాలనీలను ముంచేత్తుందుకు కారణం,  తీవ్రమయిన వర్షపు నీటి పారించే శక్తి డ్రైనేజీ వ్యవస్థకు లేకపోవడమే.

 

భవిష్యత్తులో వర్షాల క్యాలెండరే కాదు, ఉదృతి కూడా పెరగనున్నందున ఆకస్మిక వరదల్లో హైదరాబాద్ ఏటా మునిగిపోతూనే  ఉండే ప్రమాదం ఉంది.  భారీగా ఆస్తినష్టమూ జరగవచ్చు. వరదనీటిని సులభంగా ఇముడ్చుకునేందుకు హైదరాబాద్‌ లో చెరువులను నిర్మించి   కట్టుదిట్టం చేశారు. పట్టణీకరణతో వచ్చిన  భూ భకాసులురు ఈ చెరువులను, ఈ చెరువుల్లోకి నీటిని తీసుకువెళ్లే నాలాలను మింగేశారు.  ఇదే వరదలకు కారణమని ఇపిటిఆర్ ఐ చెబుతున్నది. అందుకే  డ్రేేనేజీ సామర్ధ్యం రానున్న వరదల నీటి సరిపోయేలా నిర్మించినపుడే  ఈ ముప్పు తప్పుతుంది.

click me!