(VIDEO) హైదరాబాద్ లో దారుణం.. వడ్డీ ఇవ్వలేదని భార్యను ఎత్తుకెళ్లారు

Published : May 17, 2017, 08:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
(VIDEO) హైదరాబాద్ లో దారుణం.. వడ్డీ ఇవ్వలేదని భార్యను ఎత్తుకెళ్లారు

సారాంశం

నార్త్ జోన్ పోలీసులు నిజామాబాద్ వెళ్లి వారిని పట్టుకున్నారు. నిందితులు కృష్ణ జిల్లాకు చెందిన శ్రీనివాస్, సాయి రామ్, రాజీ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు.

కాల్ మనీ వ్యాపారుల తరహాలో ఇప్పుడు వడ్డీ వ్యాపారులు నడుస్తున్నారు. సరికొత్త దందాతో అప్పు తీసుకున్నవారికి చుక్కలు చూపిస్తున్నారు.

 

వడ్డీ ఇవ్వడం లేదని ఓ వ్యక్తి భార్యను ఈడ్చుకెళ్లిన సంఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటు చేసుకుంది.

 

ఓ వ్యక్తి రూ. 5 లక్షలు అప్పుతీసుకొని దానిపై వడ్డి చెల్లించకపోవడంతో అప్పిచ్చిన వడ్డీ వ్యాపారులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

 

పట్టపగలు నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే వడ్డీ వ్యాపారులు అతడి  భార్యనుఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.

 

ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీలో లభించాయి. అలా తీసుకెళ్లిన మహిళను వారు నిజామాబాద్ లో బంధించారు. ఇలా రెండు రోజుల అక్కడే ఉంచారు.

 

అయితే  ఈ విషయం తెలుసుకున్న నార్త్ జోన్ పోలీసులు నిజామాబాద్ వెళ్లి వారిని పట్టుకున్నారు. నిందితులు కృష్ణ జిల్లాకు చెందిన శ్రీనివాస్, సాయి రామ్, రాజీ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు.

 

ఈ ఘటనతో ప్రమేయం ఉన్న సత్య నారాయణ, వెంకట్, సాయి స్వరూప్ లు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

 

 

PREV
click me!

Recommended Stories

Telangana Assembly: కేటీఆర్, హరీశ్‌ సహా 22 మంది BRS ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారు?
కేటీఆర్..ఇది పద్దతి కాదు..Speaker Gaddam Prasad To MLA KTR | Telangana Assembly Session