ఖాకీల అండతో గులాబీ గుండాగిరి: షబ్బీర్ అలీ

Published : May 17, 2017, 04:27 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
ఖాకీల అండతో గులాబీ గుండాగిరి: షబ్బీర్ అలీ

సారాంశం

కోమటిరెడ్డి పై దాడి అమానుషం, అప్రజాస్వామికం అని విమర్శించారు. ఈ రోజు ఆయన ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీలో కాంగె)స్ పక్ష ఉపనేత సీనియర్ ఎంఎల్ఎ కోమటి రెడ్డి వెంకటరెడ్డిపై టిఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లుశాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ చెప్పారు.

 

కోమటిరెడ్డి పై దాడి అమానుషం, అప్రజాస్వామికం అని విమర్శించారు. ఈ రోజు ఆయన ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు.

 

‘తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో ఎంఎల్ఎ ను పాల్గొననీయకుండా అడ్డుకోవడం  ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. కోమటిరెడ్డిపై పెట్టిన కేసులను భేష రతుగా ఎత్తివేయాలి. క్షమాపణ చెప్పాలి.

 

రాష్ట్రంలో పోలీసులు, అధికార యంతా)గాన్ని అడ్డంపెట్టుకుని నియంతృత్వంగా వ్యవహరించడం టిఆర్ఎస్ నాయకుల నైజంగా మారిపోయింది. సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రం కోసం మంతి)పదవిని సైతం వదులుకున్న వారిని గుండాలుగా, రౌడీలుగా చితీ)కరిస్తున్నారంటే టిఆర్ఎస్ నాయకుల తీరు ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు.

 

తెలంగాణ దో)హులకు మంతి)పదవులు, చైర్మన్ పదవులు ఇస్తూ, నిజంగా త్యాగాలు చేసిన వారిని మాత్రం అవమానాలు పాలు చేస్తున్నారు. రాష్ట్రంలో  ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిఒక్కరు రౌడీలు గుండాలుగా కనిపించడం అధికారంలోని వారి సంకుచిత మనస్తత్వాన్ని నిరూపిస్తోంది.‘ అని ధ్వజమెత్తారు.

 

 ప్రభుత్వ  సొమ్ముతో కార్యకర్తల మీటింగ్ లు పెట్టుకోవడం టిఆర్ఎస్ కు అలవాటుగా మారిందన్నారు. మొన్న ఖమ్మంలో రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు, నిన్న ధర్నా చౌక్ లో ప్రతిపక్షాలు ప్రజాసంఘాలపై దాడి, నేడు నియోజకవర్గాల్లోనే ఎంఎల్ఎలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలో టిఆర్ఎస్ పై)వేటు సైన్యం పాలన చేస్తున్నట్లుగా ఉందన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?