
కత్తిపోటుకు గురైతే తప్పు పొడిచినవాడిది కాదు కత్తిదే అంటే ఎలా ఉంటుంది...? ఆ కత్తి పైనే చర్యలు తీసుకోవాలంటే ఏమనిపిస్తోంది…? వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా మీద ఇటీవల కొందరు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారం కూడా అలానే అనిపిస్తోంది.
రాజకీయాల్లోకి రాకముందే రోజా సినీ నటిగా రాణించారు. ఇప్పుడు టీవీ షోల్లోనూ అదరగొడుతున్నారు. ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్న ఈటీవీలోని జబర్దస్త్ షో సౌత్ ఇండియాలోనే టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. అయితే ఇది ఫక్తు బూతు ప్రోగ్రాం అని విమర్శలొస్తున్నాయి. ఇదే చానెళ్లో ప్రసారం అవుతోన్న పటాస్ షో కూడా ఇలానే ఉంటోంది.
ఈ రెండింటిపై చాలా ఫిర్యాదులొస్తున్నాయి. అయితే వీటిని ప్రసారం చేస్తున్న టీవీ చానెళ్లు వాటిని లైట్ గానే తీసుకుంటుంది. అయితే ఈ షోలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ బాలానగర్ పోలీసులకు
సెన్సార్‌బోర్డు సభ్యుడు నందనం దివాకర్ కంప్లైట్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది... మంచి పనే చేశాడనుకోవచ్చు. కానీ, ప్రజా ప్రతినిధిగా వున్న రోజా జబర్దస్త్ లాంటి కార్యక్రమంలో పాల్గొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం గమనార్హం.
అయితే ఈ కంప్లైట్ పచ్చదళం ప్రోత్సాహంతోనే ఇచ్చారన్నది బయటకు వినిపిస్తున్న రూమర్.
రోజాను టార్గెట్ చేస్తూ టీడీపీ చాలా ఎత్తుగడలు వేస్తూనే ఉంది. అందులో ఇది కూడా ఒక భాగమేనని ప్రచారం జరుగుతోంది.
రోజా అలాంటి టీవీ షో లో పాల్గొనడం తప్పే అనుకుందాం మరి, ఆ షో ప్రసారం చేస్తున్న చానెళ్ ది తప్పు కాదా.. పచ్చదళం ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదనేది అసలు ప్రశ్న.