కోర్టును తప్పుదోవ పట్టించారు: వైవీఎస్ చౌదరిపై మోహన్ బాబు

By narsimha lodeFirst Published Apr 2, 2019, 3:17 PM IST
Highlights

చెక్ బౌన్స్ కేసులో  కోర్టును తప్పుదోవ పట్టించారని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. 

హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో  కోర్టును తప్పుదోవ పట్టించారని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. 

మంగళవారం నాడు ఎర్రమంజిల్ 23వ కోర్టు తనకు ఏడాది జైలు శిక్ష విధించిన  విషయమై ఆయన స్పందించారు. 2009లో సలీమ్ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

తమ బ్యానర్‌లోనే మరో సినిమాను తీసేందుకు వైవీఎస్‌ చౌదరికి రూ. 40 లక్షల చెక్ ఇచ్చినట్టుగా చెప్పారు. సలీమ్ అనుకొన్నస్థాయిలో విజయం సాధించని కారణంగా వైవీఎస్ చౌదరితో చేయాలనుకొన్న మరో సినిమాను వద్దనుకొన్నట్టుగా ఆయన వివరించారు. ఇదే విషయాన్ని  తాను వైవీఎస్ చౌదరికి కూడ చెప్పానని ఆయన తెలిపారు.

తాను ఇచ్చిన చెక్‌ను కూడ బ్యాంకులో వేయకూడదని కూడ వైవీఎస్ చౌదరిని కోరానని చెప్పారు. అయితే తాను చెప్పిన మాటను వినకుండా బ్యాంకులో చెక్‌ వేసి బౌన్స్ చేశారని వైవీఎస్ చౌదరిపై మోహన్ బాబు మండిపడ్డారు. తనపై చెక్ బౌన్స్ కేసు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.దీంతో వైవీఎస్ చౌదరికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఈ తీర్పుపై సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నామని ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు జైలు శిక్ష

మోహన్ బాబుకి జైలు శిక్ష.. అసలేం జరిగిందంటే..?

మోహన్ బాబుకి బెయిల్.. 30 రోజులు గడువు

click me!