పారిపోయేవాడిని కాదు: హరీష్‌కు జగ్గారెడ్డి కౌంటర్

Published : Apr 02, 2019, 03:07 PM IST
పారిపోయేవాడిని కాదు: హరీష్‌కు జగ్గారెడ్డి కౌంటర్

సారాంశం

 దసరా తర్వాత తానేంటో చూపిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంపై పోరాటం చేసేవాడినే తప్ప తాను వెనుకంజ వేసేవాడిని  కాదన్నారు.

సంగారెడ్డి:  దసరా తర్వాత తానేంటో చూపిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంపై పోరాటం చేసేవాడినే తప్ప తాను వెనుకంజ వేసేవాడిని  కాదన్నారు.

మంగళవారం నాడు ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన గురించి మాట్లాడే అర్హత హరీష్‌రావుకు లేదన్నారు.  

తాను ప్రభుత్వంపై పోరాటం చేసేవాడినే కానీ పారిపోయేవాడిని కాదన్నారు.  సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వస్తోందని ఆయన చెప్పారు.సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు.ఈ విషయమై తాను ప్రజలతో చర్చించనున్నట్టు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ