మోహన్ బాబుకి బెయిల్.. 30 రోజులు గడువు

By ramya NFirst Published Apr 2, 2019, 2:47 PM IST
Highlights

సినీనటుడు మోహన్ బాబుకి ఎర్ర మంజిల్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 


సినీనటుడు మోహన్ బాబుకి ఎర్ర మంజిల్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.  చెక్ బౌన్స్ కేసు విషయంలో మోహన్ బాబుకి ఎర్రమంజిల్ న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో మోహన్ బాబు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఫిటిషన్ దాఖలు చేయగా... న్యాయస్థానం అంగీకరించింది.

ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు  చేసింది. 30 రోజులు బౌన్స్ అయిన నగదును దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. నెలరోజుల లోపు చౌదరికి ఇవ్వాల్సిన రూ. 48 లక్షలు చెల్లించేస్తే ఈ కేసు కొట్టివేయడం జరుగుతుంది.

2010లో చెక్ బౌన్స్ కేసును దర్శకుడు వైవీఎస్ చౌదరి వేశాడు. ఈ కేసులో ఏ 1 లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నాడు.2010 లో రూ. 48 లక్షలు చెక్ బౌన్స్ వ్యవహారంపై చెక్‌బౌన్స్‌ కేసు వ్యవహారంలో నిర్మాత వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. 

ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్‌, ఏ2గా మంచు మోహన్‌బాబుగా కోర్టు తేల్చింది.2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది.  బాధితుడికి కోర్టు ఆదేశాల మేరకు జరిమానాగా రూ.41.75 లక్షలు చెల్లించకపోతే మరో మూడు మాసాల పాటు జైలు శిక్షను పొడిగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.మంగళవారం  ఈ కేసు విషయమై ఎర్రమంజిల్ 23 కోర్టు జడ్డిజ వి. రఘునాథరావు తీర్పు వెలువరించారు. 

related news

చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు జైలు శిక్ష

మోహన్ బాబుకి జైలు శిక్ష.. అసలేం జరిగిందంటే..?

click me!