కేసిఆర్ సర్కారు భయపడ్డది

First Published Oct 27, 2017, 11:06 AM IST
Highlights

అసెంబ్లీ మీడియా పాయింట్ లో వంశీచంద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చూసి భపడిందన్నారు కాంగ్రెస్ ఎమ్మల్యే చల్లా వంశీచంద్ రెడ్డి. తాము ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపు కు భయపడి నిన్నటినుంచే రైతులను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. రైతులు, కాంగ్రెస్ నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో వంశీ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

రైతుల ఆత్మహత్య లో దేశంలో నే తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉందని, దీనికి టిఆర్ఎస్ సర్కారు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు అందుకే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు.స్వామినాథన్ సిఫారాసుల మేరకు ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వలేదని ఆరోపించారు.

ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భారీగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను విస్మరించిన ప్రభుత్వానికి రైతులే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అక్రమంగా రైతులను అరెస్ట్ చేసినందుకు సభలో సీఎం క్షమాపణ చెప్పి, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

click me!