బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరి తనవెంట తిరుగుతున్న ముఖ్య అనుచరులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సీరియస్ అయ్యారు.
హైదరాబాద్ : ఇటీవలే అధికార బిఆర్ఎస్ పార్టీని వీడి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కేసీఆర్ సర్కార్ పై సీరియస్ అయ్యారు. తనతో బిఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. తన ముఖ్య అనుచరులు, కాంగ్రెస్ నాయకులకు పోలీసులతో అర్ధరాత్రులు ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులకు మద్దతుగా మైనంపల్లి హన్మంతరావు స్వయంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆల్వాల్ సీఐ ఆనద్ కిషోర్ బిఆర్ఎస్ నాయకులకు కొమ్ముకాస్తూ తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నాడని మైనంపల్లి ఆరోపించారు. ఇలా తన వెంటతిరిగే వారిని భయబ్రాంతులకు గురి చేయాలని బిఆర్ఎస్ పెద్దల నుండి పోలీసులకు ఆదేశాలు అందివుంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
undefined
పోలీసులు రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని... అధికార బిఆర్ఎస్ పార్టీకి, నాయకులకు కొమ్ముకాయడం తగదని మైనంపల్లి హెచ్చరించారు. ఇకపై తన అనుచరులు, కాంగ్రెస్ నాయకుల జోలికి రావద్దని పోలీసులను హెచ్చరించారు.
Read More కాంగ్రెస్‌తో సీట్ల సర్ధుబాటుపై చర్చలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని... ఒంటెద్దు పోకడలకు పోవద్దని మైనంపల్లి సూచించారు. బిఆర్ఎస్ లో వున్నంతకాలం ఒక్కసారికూడా గన్ మెన్ల ను మార్చలేదని... కాంగ్రెస్ లో చేరగానే మార్చారని అన్నారు. ఒక్కో బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఐదేళ్లలో ఒక్కసారి కూడా గన్ మెన్లను మార్చలేదని... అలాంటిది తన గన్ మెన్లను మార్చడం సరైనపద్దతి కాదన్నారు.
ప్రజా సమస్యలు పట్టించుకోకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనను పక్కనపెట్టిందని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు. కేవలం రాజకీయాల కోసమే ప్రభుత్వ నిర్ణయాలు వుంటున్నాయన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలే ఓటు అనే అస్త్రాన్ని ఉపయోగించి బుద్ది చెబుతారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు.