ఫిస్ట్ బంప్ : మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న మిస్ ఆసియా ఆకాంక్ష సింగ్...

By AN TeluguFirst Published Jul 27, 2021, 4:41 PM IST
Highlights

ఒత్తిడిని ఎలా మేనేజ్ చేసుకోవచ్చో, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఏంటో, బాల్యం, కౌమారదశ నుండి యుక్తవయస్సు వరకు జీవితంలోని ప్రతి దశలో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆకాంక్ష సింగ్ తెలిపారు.

మానసిక ఆరోగ్యం ఎంత మంచిదో చెబుతూ...దానికోసం ఒత్తిడి, డిప్రెషన్ లనుంచి బయటపడాలని కోరుతూ మిస్ ఆసియా బ్యూటీ విన్నర్ ఆకంక్షా సింగ్ ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా మొదట తన స్వస్థలమైన డెహ్రాడూన్లో ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

తన ప్రచారాన్ని హైదరాబాద్ లో మంగళారం ఉదయం ప్రారంభించారు. దీనికి వేదికగా కేబీఆర్ పార్క్ ను ఎంచుకున్నారు. ఇక్కడికి వాకింగ్ వచ్చేవారి దృష్టిని ఆకట్టుకోవడానికి ఆమె బ్యానర్లను ఏర్పాటు చేశారు. 

మానసిక ఆరోగ్యానికి డిప్రెషన్ ను దూరం చేయాలని,, దీనినుండి బయటపడడానికి మందులు, చికిత్స ఉన్నాయని మీకు తెలుసా?.. మీ మానసిక ఆరోగ్యం కోసం, మీ ఆప్తుల కోసం డిప్రెషన్ ను ఫిస్ట్ బంప్ చేయాలంటూ పిలుపునిచ్చాడు.

ఆమె ప్రచారంలో భాగంగా అనేక మంది వాకర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆరోగ్యవిషయాలు, ఒత్తిడికి సంబంధించిన విషయాల మీద వారి సందేహాలు పంచుకున్నారు. 

ఒత్తిడిని ఎలా మేనేజ్ చేసుకోవచ్చో, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఏంటో, బాల్యం, కౌమారదశ నుండి యుక్తవయస్సు వరకు జీవితంలోని ప్రతి దశలో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆకాంక్ష సింగ్ తెలిపారు.

డెహ్రాడూన్ కి చెందిన ఆకాంక్ష సింగ్ 2017 మిస్ ఆసియా అవార్డు అందుకుంది. ఆమె ప్రొఫెషనల్ మోడల్, నటి, ఫిట్నెస్ ఔత్సాహికురాలు. ఆమె స్వయంగా హైదరాబాద్ లోని అనేక మాల్స్, పార్కుల్లో ఈ ప్రచారాన్ని చేపట్టారు. ఈ అవగాహన కార్యక్రమం చాలామందికి స్పూర్తినిస్తుందని ఆమె తెలిపారు. అంతేకాదు చాలామందితో మాట్లాడడం, 4 వేర్వేరు ప్రదేశాలు, 2 పార్కలు, మాల్స్ న కవర్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. 

తన ఈ ప్రయత్నం వెనుక తల్లి సంతోష్ పుండిర్ ప్రేరణ ఉందని చెప్పుకొచ్చారు. మా అమ్మ క్లినికల్ డిప్రెషన్‌ బారిన పడింది. ఆ సమయంలో మా నాన్న భన్వర్ సింగ్ పుండిర్, ఆమెకు  నిరంతరం మద్దతు ఇస్తూ నిరాశ నుంచి బయటపడేలా చేశారని చెప్పుకొచ్చారు. 

తన భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుతూ.. “నేటి ప్రపంచంలో, మానసిక ఆరోగ్య సమస్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దీని గురించి చర్చించం, డిప్రెషన్ వైపు సాగే వారి ఆలోచనల్ని కట్టడి చేయడం ముఖ్యం. 

డిప్రెషన్ అనేదాన్ని మనదేశంలో చాలా తేడాగా చూస్తారు. అదేదో నిషేధించబడినదిగి వ్యవహరిస్తారు. దీన్ని మార్చడానికి, వారికి మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికోసమే నేను భవిష్యత్తులో మరింత కార్యాచరణ చేపట్టబోతున్నాను. అని తెలిపారు. 

2013 లో, వరల్డ్ హెల్త్ అసెంబ్లీ  "2013-2020 సమగ్ర మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక" ను ఆమోదించింది. ఈ ప్రణాళిక ప్రకారం డబ్ల్యూహెచ్ వో లోని సభ్య దేశాలన్ని నిబద్ధతతో పనిచేయాలి. 

click me!