కేంద్ర ప్రభుత్వం రైతులు, వ్యవసాయం పట్ల అనుసరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ వచ్చే శుక్రవారం(నవంబర్ 12వ తేదీన) ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీలించారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారని... వారికి మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో ఈ నెల12న భారీ ధర్నాకు పిలుపునిచ్చినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ చెప్పట్టనున్న ధర్నాకోసం జరుగుతున్న ఏర్పాట్లను సహచర మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులతో కలిసి తలసాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా minister talasani srinivas yadav మట్లాడుతూ... TRS పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. అతి తక్కువ కాలంలోనే దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని... అలాంటి తెలంగాణను కేంద్రం ప్రోత్సహించకుండా ఇబ్బంది పెడుతోందని తలసాని ఆందోళన వ్యక్తం చేసారు.
undefined
వీడియో
''బిజేపీ రాష్ట్ర నేతలు డ్రామాలు చేస్తున్నారు. telangana bjp నేతలను పిలిచి చెప్పాలని కేంద్ర బీజేపీ నేతలను కోరుతున్నాం. దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తాం'' అని తలసాని హెచ్చరించారు.
read more 'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '
''కేంద్రం వ్యవసాయ రంగంలో నల్లచట్టాలని తెచ్చింది. ఇక వ్యవసాయం గురించి రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రాల నడ్డి కేంద్రం విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తాం'' అని మంత్రి తలసాని స్పష్టం చేసారు.
ఇక home minister mahamood ali మాట్లాడుతూ... ఈ నెల12వ తేదిన జరిగే రైతు మద్దతు ధర్నాలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. cm kcr ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తుంటే... కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో రాష్ట్రంలో వరి సాగు పెరిగిందన్నారు హోంమంత్రి. ఇలాంటి కీలక సమయంలో వడ్లు కొనమని కేంద్రం రైతులను అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని... అందువల్లే రైతుల పక్షాన నిలబడి టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
read more తెలంగాణ కోటా మేరకు ఎరువులు సరఫరా చేయాలి: కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ
ఇక ఇప్పటికే పంజాబ్ మాదిరిగానే తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తారో లేదో చెప్పాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ డిమాండ్ చేసారు. ఈ విషయమై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు వదిలిపెట్టబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు. వరి ధాన్యం కొనుగోలు విషయాన్ని తీసుకొని కేంద్రంపై కేసీఆర్ యుద్ధం ప్రకటించిన సీఎం ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పాలన్నారు.
ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 12న రాష్ట్రంలోని మండల స్థాయి నుండి జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ఆందోళనలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ పోరాటానికి కలిసివచ్చే పార్టీలను కలుపుకుపోవాలని కూడా టీఆర్ఎస్ భావిస్తోంది.