5 నెలలుగా అమిత్ షా అపాయింట్ దొరకడం లేదు.. అది నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డి

By team teluguFirst Published Nov 10, 2021, 3:04 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రెస్‌మీట్లు కల్లు కంపౌడ్‌ను తలపిస్తున్నాయని విమర్శించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రెస్‌మీట్లు కల్లు కంపౌడ్‌ను తలపిస్తున్నాయని విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ శిక్షణా తరగతుల కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భవిష్యత్తులో మరిన్ని శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదిస్తే హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహిస్తామని అన్నారు. 

రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సంజయ్‌పై KCR వ్యాఖ్యలకు బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై చర్చ జరగకుండా ఉండేందుకే టీఆర్‌ఎస్, బీజేపీలు ఉమ్మడి వ్యుహంతో ముందుకు వెళ్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని బయటపెట్టే ధైర్యం తమకు ఉందని అన్నారు. ఆధారాలు ఉన్నాయని.. ఐదు నెలలుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కోసం చూస్తున్నామని.. కానీ అనుమతి దొరకడం లేదని చెప్పారు. బండి సంజయ్ అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇప్పిస్తారా అంటూ సవాలు విసిరారు. 

Also read: హుజురాబాద్ ఎఫెక్ట్‌.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు

నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే.. కేసీఆర్ అవినీతిని నిరూపిస్తానని అన్నారు. నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. మరోసారి యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్‌ సీఎంగా చేసేందుకు కేసీఆర్‌తో మోదీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. 

Also read: కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో గందరగోళం: రేవంత్ ప్రసంగిస్తుండగా కోమటిరెడ్డి వర్గీయుల ఆందోళన

ప్రతిపక్షాల ఓట్లు చీల్చితే తప్ప యోగి ఆదిత్యనాథ్ మరోసారి యూపీ సీఎం కాలేడని అన్నారు. అందుకే ఎంఐఎం 100 సీట్లలో పోటీ చేయబోతుందని.. ఆ పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతిపక్షాలను ఓడగొట్టడానికి పనిచేస్తారని ఆరోపించారు. అందుకే మోదీ, అమిత్ షాలు కేసీఆర్‌ను కలుస్తున్నారని విమర్శించారు. వారికి సాయం చేస్తున్నందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ టీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. 

విద్యుత ప్రాజెక్టులో కేసీఆర్ వెయ్యి కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. వేల కోట్ల అవినీతి జరిగితే.. ఎందుకు సీబీఐ విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ లాలూచీ కోసం తెలంగాణ సమాజాన్ని బలి చేస్తున్నారని విమర్శించారు. నెక్లెస్ రోడ్డు వద్ద 10 ఎకరాలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు (talasani srinivas yadav) తాకట్టు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించే దమ్ము బీజేపీకి ఉందా అని నిలదీశారు. 

click me!