వికారాబాద్ లో ఘోరం... 20మంది విద్యార్థులతో వెళుతున్న ఆటో బోల్తా, ముగ్గురి పరిస్థితి విషమం

By Arun Kumar PFirst Published Nov 22, 2021, 1:29 PM IST
Highlights

20మంది విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్ కు వెళుతున్న ఆటో బోల్తా పడిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రాణాలతో చెలగాటం ఆడాడు ఆటో డ్రైవర్. 

వికారాబాద్: స్కూల్ విద్యార్థులతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో 20మంది చిన్నారులు వుండగా తొమ్మిదిమంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి మాత్రం విషమంగా వున్నట్లు సమాచారం.  

వివరాల్లోకి వెళితే... vikarabad district లోని కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ మోడల్ స్కూలుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఆటో రిక్షాలో పాఠశాలకు వస్తుంటారు. ఇలా రోజూ మాదిరిగా ఇవాళ(సోమవారం) కొందరు విద్యార్థులు ఆటోలో స్కూల్ కు బయలుదేరారు. అయితే మరికొద్దిసేపట్లో muzahidpur model school కు చేరుకుంటారనగా ఆటో ప్రమాదానికి గురయ్యింది. 

ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో అందులోని 20మంది విద్యార్థుల్లో తొమ్మిందిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ auto accident జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన విద్యార్థులను దగ్గర్లోని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ కు తరలించారు. 

read more  సిద్దిపేట జిల్లాలో ఘోరం... వరికుప్పను ఢీకొని యువకుడు మృతి, ప్రాణాపాయస్థితిలో మరొకరు

ఉదయం స్కూలుకని బయలుదేరిన తమ పిల్లలు రోడ్డు ప్రమాదానికి గురయినట్లు తెలుసుకుని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలకోసం పరుగున హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్పిటల్ బెడ్ పైచూసి బోరున విలపిస్తున్నారు.  

ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రత్యక్షసాక్షులు, గాయపడిన విద్యార్థుల నుండి వివరాలను సేకరించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు  ప్రాథమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

read more  నారాయణగూడలో రోడ్డు ప్రమాదం.. మహిళ తల మీదినుంచి వెళ్లిన వాటర్ ట్యాంకర్..

కొందరు ఆటోవాలాలు సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ఇలా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలా కాసుల కోసం చిన్నారుల ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల రక్షణ విషయంలో జాగ్రత్తగా వుండాలని... దగ్గరుండి ఇలా పిల్లలను ప్రమాదంలోకి నెట్టవద్దని అధికారులు సూచిస్తున్నారు. 

ఇదిలావుంటే ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ విద్యార్థులతో వెళుతున్న బస్సు చెరువులోకి దూసుకెళ్ళింది. విద్యార్థులను తీసుకుని స్కూల్ కి వెళుతున్న బస్సు వేగంగా వెళుతూ ఒక్కసారిగా అదుపుతప్పిన రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. అయితే రోడ్డు పక్కనే చెరువు వుండటంతో అందులో పడిపోయింది. ఈ ప్రమాదం ఓ విద్యార్థి మృతిచెందగా చాలామంది విద్యార్థులు గాయపడ్డారు.  

srikakulam district ఎచ్చెర్ల మండలం కొయ్యూరు పంచాయితీ నిమ్మవానిపేట గ్రామానికి చెందిన విద్యార్థుల కోసం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు వస్తుంటుంది. రోజూ మాదిరిగానే ఇటీవల స్కూల్ బస్సులో తమ పిల్లలను పంపించారు గ్రామస్తులు. అయితే ఇలా తమ పిల్లలు వెళ్లిన కొద్దిసేటికే ఆ తల్లిదండ్రులు దుర్వార్త వినాల్సి వచ్చింది. కమ్మపేట నుండి నిమ్మవానిపేటకు ఎనిమిది మంది విద్యార్థులతో  వెళుతున్న క్రమంలో school bus accident కి గురయ్యింది. వేగంగా వెళుతూ అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కనున్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులోని చిన్నారుల్లో ఓ బాలుడు మృతిచెందాడు.
 

click me!