Telangana Unemployment: మంత్రి కేటీఆర్ ఇలాకాలో మరో నిరుద్యోగి ఆత్మహత్య

By Arun Kumar PFirst Published Nov 22, 2021, 12:21 PM IST
Highlights

ఉద్యోగం రావడంలేదన్న మనస్తాపంతో ఓ 24ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. 

సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు రోజురోజుకు ఎక్కవవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు కొందరయితే... ప్రైవేట్ రంగంలోనూ చదువుకు తగ్గ  ఉద్యోగం రాక మనస్తాపంతో మరికొందరు నిరుద్యోగ యువతీ యువకులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలా తాజాగా ఐటీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలోనే ఓ బిటెక్ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య చేసుకున్నాడు.  

rajanna siricilla జిల్లాకేంద్రంలోని అశోక్ నగర్ లో కల్లూరి వెంకటేశం(24) నివాసముంటున్నాడు. ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తిచేసిన అతడు ఉద్యోగ ప్రయత్నంలో వున్నాడు. అయితే ఎంతకూ తన అర్హతలకు తగిన ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

కుటుంబసభ్యులెవరూ లేకుండా ఒంటరిగా వున్న సమయంలో ఇంట్లోనే వెంకటేశ్ suicide చేసుకున్నాడు. సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఉరికి వేలాడుతూ కనిపించాడు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.  

read more  ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపం... దీపావళికి ఇంటికి వెళ్ళిన నిరుద్యోగి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

చేతికందివచ్చిన కొడుకు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉద్యోగం కోసం యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సిరిసిల్ల పట్టణంలోనూ విషాదాన్ని నింపింది.  మరో ఆత్మహత్యతో తెలంగాణలో ని unemployed suicides సంఖ్య మరింత పెరిగింది. 

TRS Government, CM KCR తీరువల్లే తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాలు వచ్చి బ్రతుకులు బాగుపడతాయని భావించిన స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలకు తెగించి యువత పాల్గొన్నారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగాలు రాకపోవడంతో మనస్థాపానికి గురయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బిజెపి, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. 

read more  దున్నపోతు మీద వానపడినట్లే.. కేసీఆర్‌లో చలనం లేదు.. మాకు ఒక్క అవకాశమివ్వండి: వైఎస్ షర్మిల

మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోనే నిరుద్యోగుల పరిస్థితి ఇలావుంటే మిగతాచోట్ల ఇంకెంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పటికయినా ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా దృష్టిపెట్టాలని కోరుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇటీవల తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై వైఎస్సార్  తెలంగాణ పార్గీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు సీఎం కేసీఆర్ అని ట్విట్టర్ వేదికగా షర్మిల మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరువల్లే రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసి చూసి నోటిఫికేషన్లు రాకపోవడంతో కొందరు ఆత్మబలిదానాలకు సిద్ధపడుతున్నారన్నారు. 

ఇప్పటికే పదుల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని షర్మిల మండిపడుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతోనే యువకుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటూ షర్మిల ఫైర్ అయ్యారు.

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి.)


 

click me!