పేల్చేస్తారట, కూల్చేస్తారట.. పిచ్చోళ్ల చేతిలో తెలంగాణను పెట్టొద్దు: బండి సంజయ్, రేవంత్‌లకు కేటీఆర్ చురకలు

Siva Kodati |  
Published : Feb 10, 2023, 05:46 PM ISTUpdated : Feb 10, 2023, 05:49 PM IST
పేల్చేస్తారట, కూల్చేస్తారట.. పిచ్చోళ్ల చేతిలో తెలంగాణను పెట్టొద్దు: బండి సంజయ్, రేవంత్‌లకు కేటీఆర్ చురకలు

సారాంశం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లపై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. తాము నిర్మాణాల గురించి మాట్లాడుతుంటే.. కొందరు కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటున్నారని భగ్గుమన్నారు. పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లపై సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ఒకాయన సచివాలయాన్ని కూలగొడతానని అంటున్నాడని మండిపడ్డారు. తాము నిర్మాణాలు చేద్దాం, పునాదులు తవ్వాలనుకుంటున్నామని కేటీఆర్ అన్నారు.వాళ్లలో ఒకాయన సమాధులు తవ్వుతామంటున్నారని.. మరొకాయన బాంబులు పెట్టి పేల్చుతామంటున్నారని సెటైర్లు వేశారు. ఇలాంటి వాళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దని ఆయన ప్రజలను కోరారు. 

ALso REad: ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చేసినా ఎవరికి నష్టం లేదన్న రేవంత్ రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..

అంతకుముందు ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రాగానే  కొత్త సచివాలయం  గుమ్మటా లను కూల్చివేస్తామన్నారు. జనం గోస – బీజేపీ భరోసాలో భాగంగా  హైద్రాబాద్   కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినిపల్లి లో 77, 78,79 వార్డులల్లో  స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను  బండి సంజయ్ శుక్రవారం నాడు   ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  ప్రసంగించారు.  

తెలంగాణలో నిజాం వారసత్వ సంస్కృతి,ని  ధ్వంసం చేస్తామన్నారు. నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని  బండి సంజయ్  చెప్పారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి  ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. రోడ్డుకు అడ్డం ఉంటే మసీదులు, మందిరాలు కులుస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావిస్తూ  దమ్ముంటే  పాతబస్తీలోని రోడ్లకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చాలని సవాల్ విసిరారు.

Also REad: అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తాం: బండి సంజయ్ సంచలనం

అసదుద్దీన్ ఓవైసీ కళ్లలో  ఆనందం  చూసేందుకుగాను  సచివాలయాన్ని తాజ్ మహల్ మాదిరిగా నిర్మించారని  బండి సంజయ్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే  కొత్త సచివాలయంలో   మార్పులు చేర్పులు చేస్తామని  ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు  ఉట్టిపేడేలా  సచివాలయంలో మార్పులు ఉంటాయని  బండి సంజయ్  ప్రకటించారు.  అంతేకాదు ప్రగతి భవన్ ను ప్రజాదర్భార్ గా మారుస్తామని ఆయన  ప్రకటించారు. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేయాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. పేదోళ్లకు ప్రవేశం లేని ప్రగతి భవన్ వుంటే ఎంత, లేకపోతే ఎంత అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం లేదని రేవంత్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu
Hyderabad Weather : ఈ వర్షాలు ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్