టెర్రరిస్ట్ విధానాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.
హైదరాబాద్: టెర్రరిస్టు విధానాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.శుక్రవారం నాడు హైద్రాబాద్ సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. దేశం కోసం తీసకున్న నిర్ణయాల కారణంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు పోయిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. మావోయిస్టులు కూడా జనజీవనస్రవంతిలో కలవాలని ఆయన కోరారు. చట్టపరిధిలో పనిచేయాలని ఆయన మావోయిస్టులకు సూచించారు.
అసెంబ్లీ సమావేశాల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తారన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను చేసుకోవాలన్నారు. ఇతర నేతలు పిలిస్తే వారి నియోజకవర్గాల్లో పాదయత్రకు తాను వెళ్తానని జగ్గారెడ్డి చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారా అని జగ్గారెడ్డిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు.
undefined
హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే కోరారు. పాదయాత్ర చేసే నేతలు షెడ్యూల్ ఇవ్వాలని కూడా మాణిక్ రావు ఠాక్రే కోరారు.
also read:కారణమిదీ:తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగ్గారెడ్డి భేటీ
రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర కు కొనసాగింపుగా కాంగ్రెస్ నేతలు హత్ సే హత్ జోడో యాత్రను నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుండి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్రను నిర్వహించనున్నారు. పాదయాత్ర కానీ, బస్సు యాత్ర కానీ, బైక్ యాత్ర చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నానని కోమటిరెడ్డి చెప్పారు. ఏదో ఒక రూపంలో ప్రజల్లో ఉండడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నేతలకు ఠాక్రే ఆదేశించారు. దీంతో పార్టీ నేతలు యాత్రలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.