తెలంగాణలో సరే... మరి గుజరాత్ సంగతేంటి సంజయ్..?: హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

Published : Mar 24, 2023, 03:14 PM IST
తెలంగాణలో సరే... మరి గుజరాత్ సంగతేంటి సంజయ్..?: హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

సారాంశం

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలంటూ డిమాండ్ చేసిన బండి సంజయ్ కు మంత్రి హరీష్ గట్టిగా కౌంటరిచ్చారు. 

హైదరాబాద్ :తెలంగాణలో ప్రధాన మంత్రి ఫసల్ భీమా అమలు చేయాలని అడిగేముందు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలుచేయడం లేదో చెప్పాలని తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ ను మంత్రి హరీష్ రావు నిలదీసారు. ఈ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేకపోవడం వల్లే చాలా రాష్ట్రాలు అమలుచేయడం లేదని... అందులో తెలంగాణ కూడా వుందని అన్నారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారని అన్నారు. ఈ పథకం రైతులకు ఉపయోగం లేదని తెలంగాణ ప్రభుత్వం అమలుచేయడం లేదని హరీష్ స్పష్టం చేసారు. 

ఇక పంటల భీమా లేకున్నా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని హరీష్ అన్నారు.స్వయంగా వెళ్లి బాధిత రైతులను పరామర్శించి ధైర్యం చెప్పడమే కాదు రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారని తెలిపారు. ఇప్పటికే రైతుల కోసం ఎంతో చేస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా రూ.228 కోట్లతో వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోడానికి సిద్దమయ్యారని... ఇలా తాను రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారని హరీష్ అన్నారు. 

పెద్దమనసుతో ముఖ్యమంత్రి రైతులను ఆదుకోడానికి ప్రకటించిన ఆర్థిక సాయం బిజెపి నాయకులకు చాలా చిన్నదిగా కనిపించడం దురదృష్టకరమని అన్నారు. దేశంలో ఇంకెక్కడైనా రైతులకు ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా?  అని బండి సంజయ్ ని హరీష్ ప్రశ్నించారు. 

Read More  బీసీలకు క్షమాపణలు చెప్పాలి: మోడీపై రాహుల్ వ్యాఖ్యలపై బండి సంజయ్

ఎన్నికల సమయంలో అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆదాని ఆదాయాన్ని డబుల్ చేశారంటూ కేంద్ర ప్రభుత్వానికి హరీష్ చురకలు అంటించారు.  అనునిత్యం రైతులను క్షోభకు గురి చేయడం, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీది... వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది అని హరీష్ అన్నారు. సాగు, రైతు సంక్షేమం గురించి బిజెపి నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని మంత్రి హరీష్  అన్నారు.

ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలుచేసివుంటే రైతులకు పరిహారం అందేదని... కానీ ఎక్కడ బిజెపికి మంచిపేరు వస్తుందోనని దీనిని అమలు చేయడం లేదని అన్నారు. అలాగని రాష్ట్ర ప్రభుత్వమయినా సమగ్ర పంటల బీమా పథకమేదైనా అమలుచేస్తుందా అంటే అదీ లేదని అన్నారు. ఇలా రైతుల నోట్లో మట్టికొడుతూ కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.

సంజయ్ విమర్శలపై తాజాగా హరీష్ స్పందిస్తూ గట్టిగా కౌంటరిచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఏయే రాష్ట్రాల్లో ఫసల్ భీమా పథకం అమలుకావడంలో లేదో ప్రకటిస్తూ చేసిన ప్రకటన కాపీని జతచేస్తూ హరీష్ ట్వీట్ చేసారు. ఇందులో గుజరాత్ తో సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫసల్ భీమా అమలుకావడం లేదన్న అంశాని హైలైట్ చేసారు హరీష్. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!