హైద్రాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగుల ధర్నా: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

Published : Mar 24, 2023, 03:04 PM ISTUpdated : Mar 24, 2023, 03:11 PM IST
హైద్రాబాద్ విద్యుత్ సౌధ వద్ద  ఉద్యోగుల  ధర్నా: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని  సోమాజీగూడ  విద్యుత్ సౌధ వద్ద  ఉద్యోగుల  ఆందోళనతో  ట్రాఫక్ జాం నెలకొంది. 

హైదరాబాద్: నగరంలోని  సోమాజీగూడ  విద్యుత్  సౌధ వద్ద  టీఎస్‌పీఈజేఏసీ ఉద్యోగులు  శుక్రవారంనాడు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో  ట్రాఫిక్ కు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేతన సవరణ, ఆర్జిజెన్ కార్మికుల సమస్యలపై మహా ధర్నా నిర్వహించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా  పలు  జిల్లాల నుండి  పెద్ద ఎత్తున కార్మికులు  విద్యుత్ సౌధ  వద్దకు వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. దీంతో  ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో  భారీ ఎత్తున  వాహనాలు నిలిచిపోయాయి. సుమారు  రెండు కిలోమీటర్ల  పాటు   వాహనాలు  రోడ్డుపైనే  నిలిచిపోయాయి.

పీఆర్‌సీతో  పాటు  29 డిమాండ్లను పరిష్కరించాలని  జేఏసీ నేతలు డిమాండ్  చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల  ఆందోళనల  నేపథ్యంలో   ఈ మార్గంలో  రోడ్లపైనే  వాహనాలు నిలిచిపోయాయి.   విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున రావడంతో  వారిని  నిలువరించడం పోలీసులకు  కష్టంగా  మారింది.  ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!