రేపటి ఇందిరా పార్క్‌ మహా ధర్నాకు అనుమతి నిరాకరణ: తెలంగాణ హైకోర్టుకు బీజేపీ

By narsimha lode  |  First Published Mar 24, 2023, 2:27 PM IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పేపర్ లీక్  కేసులో  దోషులను  కఠినంగా శిక్షించాలని  కోరుతూ  రేపు ఇందిరాపార్క్ వద్ద  మహాధర్నాకు   పోలీసులు  అనుమతిని నిరాకరించారు.  దీంతో   బీజేపీ నేతలు  కోర్టును ఆశ్రయించారు. 


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ ను నిరసిస్తూ  ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు అనుమతిని కోరుతూ  తెలంగాణ హైకోర్టులో బీజేపీ  శుక్రవారంనాడు  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు  చేసింది. 

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసును నిరసిస్తూ  రేపు ఇందిరా పార్క్ వద్ద  మహా ధర్నా చేయాలని  రెండు  రోజుల క్రితం  బీజేపీ నిర్ణయం తీసుకుంది.  ఈ విషయమై బీజేపీ నేతలు  పోలీసులకు ధరఖాస్తు  చేసుకున్నారు.  అయితే  పోలీసులు  ఈ ధర్నాకు  పోలీసులు  అనుమతిని  నిరాకరించారు.  పోలీసులు ఈ దర్నాకు  అనుమతిని  నిరాకరించడంతో  బీజేపీ నేతలు  హైకోర్టులో  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు  చేశారు . రేపటి ధర్నాకు  అనుమతిచ్చేలా  పోలీసులను ఆదేశించాలని  ఆ పిటిషన్ లో  బీజేపీ  కోరింది. 

Latest Videos

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహా ధర్నా

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ ఘటనతో  30 లక్షల మంది  నిరుద్యోగులు  తీవ్ర ఆందోళనలో  ఉన్నారని బీజేపీ  నేతలు  చెబుతున్నారు.  పేపర్ లీక్  ఘటనలో బాధ్యులను  కఠినంగా  శిక్షించాలని  ఆ పార్టీ డిమాండ్  చేస్తుంది. ఈ నెల  12, 15, 16 తేదీల్లో  జరగాల్సిన  రెండు పరీక్షలను  వాయిదా వేసింది టీఎస్‌పీఎస్‌సీ  టీఎస్‌పీఎస్ సీ  కంప్యూటర్లు  హ్యాక్ అయ్యాయని తొలుత భావించారు.

దీంతో  ఈ రెండు పరీక్షలను  వాయిదా వేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో  కీలక విషయాలు  వెలుగు చూశాయి.  కంప్యూటర్లు  హ్యాక్ కాలేదని  పోలీసులు నిర్ధారించారు. పేపర్లు లీకైనట్టుగా  గుర్తించారు.   ఈ నెల  5వ తేదీన జరిగిన ఏఈ ప్రశ్నాపత్రం లీకైందని  గుర్తించారు.  ఈ కేసు విచారణకు  రాష్ట్ర ప్రభుత్వం  సిట్  ను ఏర్పాటు  చేసింది. 

పేపర్ లీక్ ఘటనపై  కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు  చేస్తున్నాయి.  అధికార పార్టీపై  బీజేపీ  నేతలు మండిపడుతున్నారు. పేపర్ లీక్ పై   మంత్రి కేటీఆర్  బాధ్యత వహించాలని  బీజేపీ నేతలు డిమాండ్  చేస్తున్నారు. పేపర్ లీక్  ఘటనపై  సిట్  ఇప్పటికే  12 మందిని అరెస్ట్  చేశారు.   పేపర్ లీక్ కేసులో  రోజుకో కొత్త పేరు తెరమీదికి వస్తుంది. 

పేపర్ లీక్ విషయమై   రేవంత్ రెడ్డి,  బండి  సంజయ్ లు  ఆరోపణలు  చేశారు. ఈ ఆరోపణలు  చేసిన  రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కు  సిట్ నోటీసులు  జారీ చేసింది. నిన్న రేవంత్ రెడ్డి  సిట్  విచారణకు హాజరయ్యారు.  బండి  సంజయ్ ఇవాళ  సిట్ విచారణకు  హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన సిట్  విచారణకు హాజరు కాలేదు.  ఇవాళ సిట్ కు  బండి  సంజయ్ లేఖ రాశారు.  

click me!